పురపాలక శాఖలో పోస్టుల భర్తీ..

తెలంగాణ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలో 111 ఇంజనీర్ పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ఎన్.శివశంకర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీటిలో 87 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ), 24 మునిసిపల్ అసిస్టెంట్(ఎంఏఈ) పోస్టులున్నాయి. టీఎస్పీఎస్సీ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేస్తారు.