మహిళా కాలేజీలో పోకిరీలు చేస్తున్న పని చూస్తే..

cell-phone-recordings-women-college-washroom-prakasam

మహిళా కాలేజీలోకి ఇద్దరు పోకిరీలు వెళ్లి అసభ్య చేష్టలకు పాల్పడ్డారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా చీరాలలో జరిగింది. పట్టణంలోని మహిళా డిగ్రీ కాలేజీలో విద్యార్థినులు రైలు పట్టాల పక్కన నూతనంగా నిర్మించిన వాష్‌ రూమ్‌కు వెళ్లారు.
ఆ సమయంలో ఇద్దరు యువకులు గోడపై నిలబడి సెల్‌ఫోన్‌తో చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. దాంతో వారిని గమనించిన విద్యార్థినులు పెద్దగా కేకలు వేయడంతో పారిపోయే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కొందరు విద్యార్థినులు వారిలో ఒకడిని పట్టుకుని చితకబాది ప్రిన్సిపాల్ కు అప్పజెప్పారు. అతగాడి ఫోన్ పరిశీలించగా అందులో ఏమి లేదని మరొక వ్యక్తే దృశ్యాలను చిత్రీకరించాడని సమాధానమిచ్చాడు. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.