మల్టీప్లెక్స్‌లలో మంటలు…సినిమాకు వెళ్ళాలంటే వణుకుతున్న జనం

మల్టీప్లెక్స్ కి వెళ్ళి సినిమాని ఎక్సిపీరియన్స్ చేయటం అనేది ఇప్పుడు లైఫ్ స్టైల్ లో భాగం అయిపోయింది.కానీ మనం సినిమా చూసి వచ్చేవరకు లైఫ్ కి గ్యారంటీ ఉందా అంటే లేదనే సమాధానం వస్తోంది.ఇటీవలే విశాఖ గాజువాకలోని శ్రీకన్య ధియేటర్ కాంప్లెక్స్ లో జరిగిన అగ్నిప్రమాదం ధియేటర్లలోని ఫైర్ సేఫ్టీ పట్ల అనేక అనుమానాలు రేకెత్తిస్తోంది.

సినిమాకు వెళ్ళే ముందు అది మంచి సినిమానా కాదా అని తెలుసుకుని వెళ్తాం. అలాగే సినిమా హాలు మంచిదా కాదా కూడా తెలుసుకుని వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది మల్టీప్లెక్స్‌ల యుగం. ఇప్పుడు సింగిల్ స్క్రీన్ హాళ్లకు కాలం చెల్లింది. షాపింగ్ కాంప్లెక్స్ లు ఒక వైపు… దాదాపు ఆరు స్క్రీన్లతో సినిమా హాళ్ళు ఓ వైపు మొత్తం మీద ఆధునిక సంతల్లా మల్టీప్లెక్స్ లు ముందొచ్చాయి.ఇదంత వినిమయ సంస్కృతిలో భాగంగా జరుగుతోంది. అయితే మరోవైపు ప్రమాదాలు కూడా పొంచి చూస్తున్నాయి.ఇంత భారీగా కడుతున్న కట్టడాల్లో సైతం ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు సరిగా లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.గాజువాక శ్రీకన్య ధియేటర్ కాంప్లెక్స్ లోజరిగిన ప్రమాదమే ఇందుకు తాజా ఉదాహరణ

విశాఖట్నంలో మొత్తం ఆరు మల్టీప్లెక్స్ లు వున్నాయి. అవి పైకి చాలా ఖరీదైనవిగా కనిపిస్తాయి.ఫైర్ సేఫ్టీ అనుమతులు కూడా వున్నాయి.కానీ ఇంత వరకూ మాక్ డ్రిల్ నిర్వహించిన పాపాన పోలేదు.ప్రమాదాలు జరుగినప్పుడు చూసుకుందాం అనే అలసత్వం కారణంగా భారీ అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.సాధారణంగా మల్టీప్లెక్స్ లో షాపింగ్ మాల్స్ కూడా వుంటాయి.దాంతో సినిమాలు చూడటానికి వచ్చే ప్రేక్షకులతో పాటు షాపింగ్ చేయటానికి వచ్చే వారు కూడా వందల సంఖ్యలో వుంటారు.ఇలాంటి సంధర్బంలో ప్రమాదం జరిగిందంటే తొక్కిసలాట కారణం భారీగా ప్రాణనష్టం జరిగే అవకాశం వుంది.కేవలం లాభాల మీద వ్యామోహం తప్ప మల్టీప్లెక్స్ లకు వచ్చే వారి భద్రతపట్ల భాధ్యత తీసుకోవడం లేదని నగరవాసులు మండిపడుతున్నారు.

సినిమా హాళ్లలో ప్రమాదాలు జరగకుండా వుండటానికి అగ్నిమాపక శాఖ ఎన్నో ప్రమాణాలు నిర్దేశించింది.ప్రతి 12 చదరపు మీటర్లకు ఓ స్ప్రింక్లర్ వుండాలి.ఒక వ్యక్తికి 10 ఎం.ఎం ప్రదేశం వుండాలి.స్టేర్ కేస్ కనీసం 2 మీటర్లకు తక్కువ వుండకూడదు.ప్రతి 56 మీటర్లకు ఓ స్మోక్ డిటెక్టర్ ఉండాలి.ప్రతి వంద మీటర్లకి ఫైర్ ఎక్స్‌టింగ్విషర్ ఏర్పాటు చేయాలి.ప్రతి 30 మీటర్లకు మాన్యుల్ కాల్ పాయింట్స్ వుండాలి.పంపు హౌజ్ లు సమయానికి పనిచేసేలా జాగ్రత్తలు తీసుకోవాలి.ఇవన్నీ ఉన్నా అవి సక్రమంగా పనిచేయక పోతే భారీ అగ్నిప్రమాదం మనకోసం వేచి వున్నట్టే లెక్క.

ఇదిలా ఉంటే అగ్నిమాపకశాఖలో కొత్తగా నియామకాలు లేకపోవడంతో ఉన్న సింబదితోనే ఎలాకొలా నెట్టుకొస్తున్నారు.155 మంది సిబ్బంది అవసరం కాగా ప్రస్తుతం డెబ్బై మంది కూడా లేరు. వారిలో మరికొంతమంది రిటైర్మెంట్ కి దగ్గరలో ఉన్నారు.ఇలాంటి పరిస్థితిలో ఏదైనా అగ్నిప్రమాదం జరిగితే ఎలా అనే ప్రశ్నకు సమాధానం చెప్పే స్థితిలో అగ్నిమాపక శాఖ లేకపోవటం శోచనీయం.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.