పొత్తుల కోసం ఆరోజు కేసీఆర్‌ ఇంటి మెట్లు ఎక్కారు

తెలంగాణ ఏర్పాటులో టీఆర్‌ఎస్‌ పాత్ర లేదని.. కాంగ్రెస్‌ ఎంపీ గులామ్‌ నబీ ఆజాద్‌ అనడం హాస్యాస్పదంగా ఉందని టీఆర్‌ఎస్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు. 2004లో కాంగ్రెస్‌ దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు ఆజాద్‌.. పొత్తుల కోసం కేసీఆర్‌ ఇంటి మెట్లు ఎక్కారని గుర్తుచేశారు. గత్యంతరం లేక రాష్ట్రాన్ని ఇచ్చింది తప్ప, కాంగ్రెస్‌కు తెలంగాణ ప్రజలపై ఏమాత్రం ప్రేమ లేదని ఆరోపించారు. ఎన్నికల్లో గెలిచేందుకు మాత్రమే కాంగ్రెస్‌ పార్టీ ఆనాడు టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకుందని, తెలంగాణ ఇచ్చేందుకు కాదని విమర్శించారు.