టీడీపీకి ఈ స్థానాలు ఇచ్చేది లేదు : కాంగ్రెస్

madhira political update

TRSను ఓడించేందుకు మహకూటమితో జట్టు కట్టేందుకు ఉవ్విళ్లూరిన సైకిల్ పార్టీకి చుక్కలు కనబడుతున్నాయి. తమకు బలంగా ఉన్న స్ధానాల్లో కాంగ్రెస్ కూడా బలంగా ఉండటంతో ఏం చేయాలో అర్ధంకాని పరిస్థితి టీడీపీది.

NTR భవన్ లో సమావేశం అయిన నాయకులు.. పొత్తులు, సీట్లపై కాంగ్రెస్ త్వరగా తేల్చకపోతే ఎలాగని కొందరు టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై పార్టీ అధ్యక్షుడు రమణ ఎదుటే ఆయన తీరుపై నిరసన తెలిపారు. మనకు దక్కాల్సిన స్థానాలపై మీరు మెతక వైఖరి అవలంభించడం మంచిది కాదని కొందరు సీనియర్లు అసహనం వ్యక్తం చేసారు. సీట్ల సర్దుబాట్లపై త్వరగా తేలిస్తే.. ఉమ్మడి ప్రణాళిక పై ముందుకు వెళదామని దీనిపై త్వరగా తేల్చాలని నేతలు సమావేశంలో డిమాండ్ చేసారు.

టీడీపీ ఆశిస్తున్న జగిత్యాల, వనపర్తి, నర్సంపేట స్థానాలు ఇచ్చేది లేదని కాంగ్రెస్ క్లారిటీ ఇవ్వడంతో టీడీపీ నేతలు ఢీలా పడుతున్నారు. వనపర్తి బదులు దేవరకద్ర స్ధానం ఇస్తామని కాంగ్రెస్ సూచించిన నేపథ్యంలో టీడీపీలో వర్గ పోరు మొదలైంది. ఆ స్థానం నుండి రావుల చంద్రశేఖర్ రెడ్డి పోటీ చేయాలని భావిస్తుండగా.. ఖచ్చితంగా ఆస్థానం తనకే కావాలని సీనియర్ నేత కొత్తకోట దయాకర్ రెడ్డి పట్టుబడుతున్నారు. నర్సంపేట సీటును వదులుకొనేందుకు రేవూరి ప్రకాష్ రెడ్డి కూడా ససేమిరా అంటున్నారు. మహకూటమితో తమకేదో మేలు జరుగుతుందని భావిస్తే అసలుకే మోసం వస్తుందని టీటీడీపీ నేతలు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు వద్దే పంచాయితీ తేల్చుకొనేందుకు అమరావతికి క్యూ కడుతున్నారు.