ప్రేమ జంటకు పెద్దల హెచ్చరిక.. అడవిలో తలదాచుకున్న జంట

జనగామ జిల్లాలో ప్రేమ వివాహం చేసుకున్న ఓ జంటలు గ్రామంలోని పెద్ద మనుషులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఊరిలోకి వస్తే చంపేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. గ్రామంలోకి రావొద్దని.. వస్తే చంపేస్తామనడంతో దిక్కుతోచని స్థితిలో ఆ జంట అడవిలో తలదాచుకుంది. గుండాల మండలం మరిపడగ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.