బ్రేకింగ్: రాజమహేంద్రవరంలో పేలుడు.. స్పాట్‌లోనే..

రాజమహేంద్రవరంలో విషాదం చోటు చేసుకుంది. బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించి ఇద్దరు చనిపోయారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సిటీలోని లాలాచెరువు సుబ్బారావు నగర్‌ లోని ఓ ఇంట్లో ఈ పేలుడు సంభవించింది. గాయపడ్డవారిని రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

బాధితులంతా ఒకే కుటుంబానికి చెందినవాళ్లు. దీపావళి కోసం బాణాసంచా తయారు చేస్తుండగా ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో కుటుంబంలోని ఆరుగురికి కాలిన గాయాలయ్యాయి. సూర్యకాంతం, ధనలక్ష్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతు మృతి చెందారు. మిగిలిన నలుగురిలో దుర్గారెడ్డి, వినాయరెడ్డి పరిస్థితి విషమంగా ఉంది.

బాణాసంచా తయారీ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఇళ్ల మధ్యలోని గుడిసెలలో దీపావళి కోసం బాణాసంచా తయారుచేస్తున్నారు. అయితే..ఇది మందుగుండు సామాగ్రి వల్ల జరిగిన ప్రమాదం కాదని అంటున్నారు పోలీసులు, బాధితులు. షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల ప్రమాదం జరిగిందని అంటున్నారు.