వివాదాస్పదమైన ఈ మాయ పేరేమిటో చిత్రం

శుక్రవారం విడుదలైన ఈ మాయ పేరేమిటో చిత్రం వివాదస్పదం అయ్యింది. ఈ సిన్మాలోని ఓ పాట తమను కించపరిచేలా ఉందంటూ గుంటూరులో ఆందోళనకు దిగారు జైనులు. చిత్రాన్ని ప్రదర్శిస్తున్న థియేటర్ వద్దకు వెళ్లి షో ని అడ్డుకున్నారు. చిత్ర దర్శకుడు,నిర్మాత జైనులకు క్షమాపణ చెప్పి పాటలను తొలగించాలని డిమాండ్ చేశారు. అనంతరం తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న పాటను చిత్రం నుంచి తొలగించేలా చర్యలు తీసుకోవాలంటూ కలెక్టరేట్ లో ఫిర్యాదు చేశారు.