రైల్వేలో ఉద్యోగాలు..65 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..

రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డ్ (ఆర్ఆర్ఆర్బీ) గ్రూప్ సి ఉద్యోగాల భర్తీకినోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్ సిలోని అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్పీ)ఉద్యోగాలతో పాటు ఇతర టెక్నికల్ పోస్టులకు భారీ ఎత్తున ఖాళీలు ప్రకటించింది. మొత్తం పోస్టులు 64,371. అవి..
ఏఎల్పీ పోస్టులు : 27,795
టెక్నీషియన్ పోస్టులు : 36,576
దరఖాస్తులు ఆన్‌లైన్లో అందుబాటులో ఉన్నాయని అక్టోబర్ 1కి క్లోజ్ అవుతాయని ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపికైన ఉద్యోగులకు రూ.19,900 కనీస వేతనంతో పాటు ఇతర అలవెన్సులు ఉంటాయి. ప్రశ్నా పత్రాలు మొత్తం 15 భాషల్లో ఉంటాయని తెలిపింది.