విషాదం: విద్యుత్ షాక్ తో ఇద్దరు కార్మికులు మ‌ృతి

ఒంగోలులో విషాదం చోటు చేసుకుంది.సాంబశివనగర్‌లో నూతనంగా నిర్మిస్తున్న ఇంటికి రాడ్ బెండింగ్ పనులు చేస్తూండగా విద్యుత్ షాక్ కు గురై ఇద్దరు కార్మికులు చనిపోయారు.మరో ఇద్దరు ప్రమాదం నుండి తప్పించుకున్నారు. సాంబశివగర్ లో గోవర్ధన్‌రెడ్డి అనే వ్యక్తి ఇంటి నిర్మాణం చేపట్టాడు.చెకూరిపాడుకు చెందిన ఏడుగురు కార్మికులను పిలించాడు.వారు రాడ్ బెండింగ్ పనులు చేసేందుకు గ్రౌండ్ ఫ్లోర్ లోని ఇనుపరాడ్లను సెకండ్ ఫ్లోర్ లోకి తరలిస్తుండగా విద్యుత్ తీగలు తగిలి షాక్ గురయ్యారు.ఇద్దరు కార్మికులు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.