వైసీపీకి భారీ షాక్.. పార్టీకి రాజీనామా చేసిన కీలకనేత

ycp leader bommireddy raghavenderreddy resinged ycp

నెల్లూరు జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. వెంకటగిరి ఇన్‌ఛార్జ్‌గా తనను తప్పించి ఆనంను నియమించడంతో ఆయన మనస్తాపం చెందారు. మాట వరసకు కూడా తనకు ఏమీ చెప్పకుండా ఆనంకు సమన్వయ కర్తగా బాధ్యతలు ఇవ్వడాన్ని బొమ్మిరెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. జగన్ ఓ డిక్టేటర్‌లా వ్యవహరించి తనను అవమానించారని అన్నారు. ఆనం 50 కోట్లు ఖర్చు పెడతారు.. నువ్వు అంత పెట్టగలవా అంటూ ప్రశ్నించారని చెప్పారు. నాలుగున్నరేళ్లుగా వెంకటగిరి ఇన్‌ఛార్జ్‌గా పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేసిన తనను దారుణంగా బాధపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అవమానించిన పార్టీలో తాను కొనసాగలేనన్న బొమ్మిరెడ్డి.. భవిష్యత్ కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తానన్నారు.