ఉగ్రవాదుల అరాచకం… 29మంది మృతి

ఇరాన్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అవాజ్ నగరంలో సైనిక కవాత్‌పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో.. 29మంది మరణించారు. మరో 53మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో చనిపోయిన వారంతా రివల్యూషనరీ గార్డు విభాగానికి చెందిన సైనికులని ఇరాన్ మీడియా ప్రకటించింది. కవాతు జరుగుతుండగా.. సైనికుల దస్తుల్లో, మోటార్ సైకిల్‌పై వచ్చిన దుండగులు..  కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కవాతు సమయంలో ఒక్కసారిగా పేలుడు చోటు చేసుకోవడంతో.. జనం ప్రాణ భయంతో పరుగులు తీశారు. దాడి వెనుక పొరుగుదేశాలు సహా.. అమెరికా హస్తమున్నట్లు ఇరాన్ ఆరోపించింది.