దర్శకురాలు కన్నుమూత..

kalpana-lajmi-director-of-films-like-rudaali-dies

ప్రముఖ దర్శకురాలు కల్పన లాజ్మి (64) మృతి చెందారు. గతకొంతకాలంగా మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్న కల్పన.. శనివారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దాంతో కుటుంబసభ్యులు ఆమెను ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో చేర్పించారు. ఆదివారం తెల్లవారుజామున చికిత్స పొందతూ తుదిశ్వాస విడిచారు. ఎక్కువగా విమెన్ ఓరియెంటెడ్ చిత్రాలకు దర్శకత్వం వహించిన కల్పన మృతి చెందడం పట్ల పలువురు నటీమణులు విచారం వ్యక్తం చేశారు. కల్పన లాజ్మి మృతికి పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు.