మావోయిస్టుల దాడి తమపై ఎలా జరిగిందో చెప్పిన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు డ్రైవర్..

mla-driver-says-maoist-roundup-guns

ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోము లను మావోయిస్టులు దారుణంగా హతమార్చగా.. అక్కడ ప్రత్యక్ష సాక్షి కారు డ్రైవర్‌ కే చిట్టిబాబు జరిగిన విషయం చెప్పారు. మొదటగా తాము వెళుతున్న మార్గం మధ్యలో పదుల సంఖ్యలో మావోయిస్టులు వచ్చి తుపాకులతో రౌండప్‌ చేశారు. గన్‌మెన్‌లను సరెండర్ కావలసిందిగా కోరారు.. అనంతరం ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను కారులోనుంచి దింపి చేతులను వెనక్కి కట్టేసి నడిపించుకుంటూ మరికొంత మంది మావోయిస్టులు దూరంగా తీసుకెళ్లారని తెలిపారు. గన్‌మెన్‌ల ఆయుధాలు తీసుకొని తమని దూరంగా వెళ్లాలన్నారు. ఆ తరువాత ఇద్దరిపై కాల్పులు జరిపారు. మమ్మల్ని చంపేస్తారేమోనని పారిపోవడానికి ప్రయత్నిస్తే కాల్చిపారేస్తామని మా దగ్గర కాపలా ఉన్న కొంతమంది మావోయిస్టులు బెదిరించినట్లు చిట్టిబాబు చెప్పారు. వారిపై జరిపిన కాల్పులు శబ్దం వినబడ్డాక మమ్మల్ని వదిలేసారని, అప్పటికే కొంతమంది మావోయిస్టులు అడవిలోకి పారిపోయారని చిట్టిబాబు తెలిపాడు.