ఆ నియోజకవర్గాల్లో ఏం చెయ్యాలో తెరాసకు అర్థంకాని పరిస్థితి

congress-tdp-aliance-tension-in-trs

ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లిన కేసిఆర్ అంద‌రికంటే ముందుగానే అభ్య‌ర్దుల‌ను ప్ర‌క‌టించారు. ప్ర‌తి ప‌క్షాల‌ను ఇరుకున పెట్టాల‌ని వేసిన స్కెచ్ త‌రువాతి ప‌రిణామాలు అధినేత‌కు ఇబ్బందిక‌రంగా మారాయి. ఒక్క‌సారిగా పార్టీలో అస‌మ్మ‌తి తీవ్ర స్థాయిలో బ‌య‌టికి వ‌చ్చింది. అధినేత నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ అసంతృప్తి వ్య‌క్తం అవుతుంది.

చెన్నూరు బరిలో పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ దిగుతారని కేసిఆర్ ప్రకటించారు. కానీ అక్కడ అసమ్మతి అగ్గిలా మండుతోంది. నల్లాల ఓదేలు అనుచరుడు గట్టయ్య ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకోవడం టిఆర్ఎస్ వర్గాల్లో విషాదం నింపింది. ఆరు రోజులపాటు మృత్యువుతో పోరాడిన గట్టయ్య హైదరాబాద్ లోని ఓ ప్ర‌వేటు ఆసుపత్రిలో కన్ను మూశారు. ఇక్క‌డ ప‌రిస్తితులు పూర్తిగా మారిపోయాయి. చెన్నూరులో ఏం చేయాలో కూడా అర్థంకాని పరిస్థితి త‌లెత్తింది. దీంతో చెన్నూరులో టిఆరెస్ కు గ‌ట్టి ఎదురు దెబ్బ త‌గిలింది. ఇదే కాకుండా మిగతా నియోజకవర్గాల్లోనూ అభ్యర్థుల మీద తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తెలంగాణ వచ్చిన నాలుగున్నరేళ్ల కాలంలో నిత్యం వివాదాల్లో నిలిచిన వ్యక్తిగా జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి నిలిచారు. అవినీతి అక్రమాల్లో ఆరితేరినట్లు ఆయన మీద ఆరోపణలున్నాయి. ముత్తిరెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన నాటినుంచి ఆందోళనలు జనగామలో జరుగుతున్నాయి. ముత్తిరెడ్డి డౌన్ డౌన్ అంటూ టిఆర్ఎస్ కార్యకర్తలు జనగామలో ఆందోళన చేశారు.

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగానూ టీఆరెస్ పార్టీకి అసమ్మతి సెగ తగిలింది. నారాయణఖేడ్, ఆందోల్, పటానుచెరు లో అసమ్మతి తప్పడం లేదు. ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లా‌లో నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లో స‌త్తుప‌ల్లి, మ‌ధిర, పిన‌పాక, ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాల్లో ఖానాపూర్, ఉమ్మ‌డి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలో షాద్ న‌గ‌ర్, మ‌క్త‌ల్, ఉమ్మ‌డి క‌రింన‌గ‌ర్ జిల్లాలో రామగుండం, గోదావరిఖనిలో కేసిఆర్ ప్ర‌క‌టించిన అభ్య‌ర్దుల‌పై తీవ్ర వ్య‌తిరేకత వ్య‌క్తం అవుతోంది. స్టేషన్ ఘన్ పూర్ లో సిట్టింగ్ అభ్యర్థి తాటికొండ రాజయ్యకు వ్యతిరేకంగా టిఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. వేలాది మంది ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరిని కలిసి రాజయ్య అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని కోరారు. దీనిపై అధినేత కేసిఆర్ కు నివేదిస్తానని, ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని కడియం హామీ ఇచ్చారు.

వివాదాస్పదులు, ప్రజలకు దూరంగా ఉన్న వారు, భూకబ్జాల వంటి ఆరోపణలున్న వారిని మార్చే అవకాశం ఉందని పార్టీలో చర్చ మొదలైంది. సొంతపార్టీ నుంచే ఆరోపణల నేపథ్యంలో మార్చకతప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇందులో భాగంగానే 15 మందికి బిఫాం చేతికందేనాటికి అభ్యర్థులను మార్చే చాన్స్ ఉందని తెలుస్తోంది. ఇదంతా ముందుగా ప్ర‌క‌టించ‌డం వ‌ల్లే జ‌రుగుతుంద‌ని కొంద‌రు నేత‌ల అభిప్రాయం. ఇప్ప‌టికైనా అభ్య‌ర్దుల విష‌యంలో పున‌రాలోచించుకో‌క పోతే పార్టీకి తీవ్ర న‌ష్టం జ‌రగ‌డం ఖాయమ‌ని పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది. మరి KCR మనసులో ఏముందో చూడాలి.?

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.