రాఫెల్‌ ఒప్పందం స్కాంలో మోడీ పాత్రపై నిప్పులు చెరిగిన రాహుల్‌

rafel flights issues continue

రాఫెల్‌ ఒప్పందం స్కాంలో మోడీ పాత్రపై మరోసారి రాహుల్‌ నిప్పులు చెరిగారు. ఇంతకాలం దేశానికి కాపలాదారుని అని చెప్పుకున్న మోడీ.. ఇండియాలోని దొంగలకే దొంగ అంటూ ట్విట్టర్‌ వీడియో షేర్‌ చేశారు. రాఫెల్ ఒప్పందంపై ఫ్రాన్స్‌ పత్రిక మీడియా పార్ట్స్ ఇటీవల వెలువరించిన ఓ కథనం తాలూకు వీడియోని షేర్‌ చేశారు. డిజిటల్ వీడియో పబ్లిషర్ బ్రూట్ రూపొందించిన ఈ వీడియోలో ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్స్ ఇంటర్వ్యూలోని ప్రధానాశాలను హైలైట్ చేశారు.

రాఫెల్ ఒప్పందం కోసం అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్‌ను ఎంచుకోవాలని ఫ్రాన్స్ ప్రభుత్వం చెప్పలేదని.. భారత ప్రభుత్వమే ఆ సంస్థ పేరు సూచించిందంటూ ఆయన సదరు ఇంటర్వ్యూలో బాంబుపేల్చారు. రాఫెల్‌ ఒప్పందానికి సర్వీస్‌ ప్రొవైడర్‌గా రిలయన్స్‌ డిఫెన్స్‌ ఎంపికలో తమ పాత్ర ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు. ఆ సంస్థ పేరును భారత ప్రభుత్వమే సూచించింది. దీంతో దసాల్ట్‌ సంస్థ అనిల్‌ అంబానీతో సంప్రదింపులు జరిపింది. భారత్‌ ఎంపిక చేసిన సంస్థనే తాము ఎంచుకున్నామన్నారు ఆయన. దీంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు తారాస్థాయికి చేరాయి. గత కొంతకాలంగా రాఫెల్ ఒప్పందంపై బీజేపీని టార్గెట్ చేస్తూ వస్తున్న కాంగ్రెస్… తాజా పరిణామాలతో తన అస్త్రాలకు మరింత పదును పెడుతోంది.