తాజా మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌కు చేదు అనుభవం

bajireddy govardhanreddy go back

నిజామాబాద్‌ రూరల్‌లో తాజా మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌కు చేదు అనుభవం ఎదురైంది. మల్కాపూర్ తండాలో ఆయన ప్రచారానికి వెళ్లగా.. ప్రజలు అడ్డుకున్నారు. డబుల్‌ బెడ్రూమ్‌ ఇండ్లు ఏవని ప్రశ్నించారు. మీ అనుచరులు 10 వేల నుంచి 50 వేల రూపాయలు వసూలు చేశారని గుర్తు చేశారు. ఇన్నాళ్లయినా ఇండ్లు ఎందుకు కట్టివ్వలేదని జనం ఆగ్రహం వ్యక్తంచేశారు. కనీసం డబ్బులైనా ఎందుకు తిరిగి ఇవ్వట్లేదని నిలదీశారు. తండావాసులు నిలదీయడంతో టీఆరెస్‌ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ ఖంగుతిన్నారు.