మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి బెయిల్!

congress-leader-jagga-reddy-grants-bail

మానవ అక్రమ రవాణా కేసులో అరెస్ట్‌యిన కాంగ్రెస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డికి) బెయిల్‌ మంజూరు చేసింది సికింద్రాబాద్‌ కోర్టు. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న జగ్గారెడ్డికి సాయంత్రం విడుదలైయే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా 2004 లో నకిలీ పత్రాలు, పాస్ పోర్ట్ తో మానవ అక్రమ రవాణాకు పాల్పడ్డారని ఆయనపై ఎనిమిది సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు టాస్క్‌ఫోర్స్ పోలీసులు. మరికొద్ది రోజుల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జగ్గారెడ్డి అరెస్ట్ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. సంగారెడ్డి నియోజకవర్గం నుంచి అయన పోటీపై సందిగ్ధత నెలకొంది.