చారిత్రక ఘట్టానికి చేరువైన జగన్ పాదయాత్ర

jagan padhayatra reached 3000 kilomeeters

వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర.. చారిత్రక ఘట్టానికి చేరువైంది. మూడు వేల కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. 268 రోజులు పూర్తి చేసుకున్న జగన్‌ పాదయాత్ర.. విజయనగరం జిల్లాలో ప్రవేశించింది. వైసీపీ నేతల్లో, కార్యకర్తల్లో కొత్త జోష్‌ నింపుతోంది. ఇప్పటికే 268 రోజుల పాటు పదకొండు జిల్లాల్లో ప్రజాసంకల్ప యాత్ర చేసిన జగన్‌.. విజయనగరం జిల్లాలోకి అడుగుపెట్టారు.

కొత్తవలస సమీపంలో చింతలపాలెం దగ్గర విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన జగన్‌ పాదయాత్రకు… అపూర్వ స్వాగతం లభించింది. భారీ సంఖ్యలో తరలివచ్చిన నేతలు, కార్యకర్తలు పాదయాత్రలో భాగస్వాములయ్యారు. జగన్‌తో కలిసినడిచారు. పాదయాత్రను విజయవంతం చేసేందుకు జిల్లా నేతలు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. మరోవైపు, జగన్‌ పాదయాత్ర మూడువేల కిలోమీటర్లు చేరుకున్న సందర్భంగా.. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు.. సంఘీబావయాత్రలు చేపట్టాయి.