టాయిలెట్ డోర్ అనుకుని విమానం డోర్ తీయబోయాడు ఇంతలో..

man-opens-plane-door-air

విమానం ఎక్కడం కొత్త కాబోలు ఓ వ్యక్తి టాయిలెట్ డోర్ అనుకుని ఏకంగా గాల్లో ఎగురుతున్న విమానం డోర్ తెరవబోయాడు. ఇంతలో విమాన సిబ్బంది అప్రమత్తమై అతన్ని నిలువరించారు. దాంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటన గోఎయిర్ విమానంలో చోటుచేసుకుంది. శనివారం ఢిల్లీ నుంచి పాట్నాకు గోఎయిర్ విమానం బయల్దేరింది. అర్థరాత్ర కావడంతో అందరూ నిద్రలో ఉన్నారు. ఇంతలో ఓ వ్యక్తి టాయిలెట్‌కు వెళ్లడంకోసం నిద్ర లేచాడు. అయితే పొరపాటున టాయిలెట్ డోర్ అనుకొని విమానం తలుపు తెరిచే ప్రయత్నించాడు. ఇది గమనించి విమాన సిబ్బంది అతడిని నిలువరించి టాయిలెట్ కు పంపారు. అనంతరం పాట్నా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌కు అప్పగించారు.