‘ఆర్.ఎక్స్ 100’ కన్నడ హక్కులు డి.ఎస్.రావు సొంతం!!

rx100-kannada-rites-taken-ds-rao

నితిన్ తో ‘ద్రోణ’, నానితో ‘పిల్ల జమీందార్’, నిఖిల్ తో ‘కళా వర్ కింగ్’, మంచు మనోజ్ తో ‘మిస్టర్ నూకయ్య’ వంటి పలు భారీ చిత్రాలు నిర్మించిన ప్రముఖ నిర్మాత డి.ఎస్.రావు కన్నడ రంగంలో అడుగుపెడుతున్నారు. తెలుగులో అనూహ్య రీతిలో, అసాధారణ విజయం అందుకున్న “ఆర్.ఎక్స్.100” చిత్రం కన్నడ హక్కులు ఫాన్సీ రేట్ చెల్లించి సొంతం చేసుకున్న డి.ఎస్.రావు.. శాండల్ వుడ్ లోని ఓ సంచలన యువ కథానాయకుడితో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కాగా సినిమాకు సంబంధించిన మిగతా విషయాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.