యూఎస్‌లో చంద్రబాబుతో ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ

ఐక్యరాజ్య సమితిలో ఆంధ్ర రైతుల గురించి మాట్లాడ్డం అదృష్టంగా భావిస్తున్నానని ఏపీ సీఎం చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు గొప్పదనం తెలియాలనే ఉద్దేశంతోనే.. తాను తెలుగులో ప్రసంగించానన్నారు. ప్రకృతి సేద్యంలో ఏపీ ప్రపంచానికి ఆదర్శం కాబోతుందంటున్న చంద్రబాబుతో ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ.

* యూఎన్‌ఓలో ఆంధ్రరైతుల గురించి మాట్లాడడం అదృష్టంగా భావిస్తున్నా
* తెలుగు భాష గొప్పదనం చాటిచెప్పాలని.. ప్రసంగాన్ని తెలుగులోనే ప్రారంభించాను
* జీరో బడ్జెట్‌- నేచురల్‌ ఫార్మింగ్‌పై ప్రజంటేషన్‌ ఇచ్చాను
* అన్ని దేశాల ప్రతినిధులూ నా ఆలోచనకు మద్దతు తెలిపారు
* ప్రకృతి సేద్యంలో ప్రపంచానికి ఏపీ ఆదర్శం- చంద్రబాబు
* ప్రకృతి సేద్యంపై రాష్ట్రంలో రైతులు ఆసక్తిగా ఉన్నారు- చంద్రబాబు
* ప్రస్తుతం రాష్ట్రంలో 3.5లక్షల ఎకరాల ప్రకృతి సేద్యం-చంద్రబాబు
* ఐదు లక్షల ఎకరాలకు విస్తరించనున్న ప్రకృతి సేద్యం
* ప్రకృతి ప్రేమికులందరూ ప్రకృతిసేద్యానికి మద్దతు తెలుపుతున్నారు
* రసాయన ఎరువులను భరించే శక్తి భూమికి లేదు
* భూమిని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది- చంద్రబాబు
* ఇరవై ఏళ్ల క్రిందే టెక్నాలజీ అవసరాన్ని గుర్తించాను
* ప్రస్తుతం ముఖ్యమైన ఘట్టంలో ఉన్నాం
* టెక్నాలజీని ప్రకృతిని కాపాడేందుకు ఉపయోగిస్తేనే అసలైన అభివృద్ధి
* మంచినీరు, మంచి ఆహారం, మంచి గాలితోనే మంచి జీవనం
* ప్రకృతితో మమేకయ్యే కార్యక్రమాన్ని చేపట్టాం
* 2022 వరకు ప్రకృతి సేద్యాన్ని మరింత అభివృద్ధి చేస్తాం
* ఇదో స్ఫూర్తిదాయకమైన ఉద్యమం
* ప్రపంచమంతా మహిళలు అంకితభావంతో పనిచేస్తున్నారు
* మహిళలకు గౌరవం, ప్రాధాన్యత ఇవ్వకుండా అభివృద్ధి అసాధ్యం
* 20 ఏళ్ల క్రితం మహిళా సంఘాలను ఏర్పాటు చేశాం
* ఇప్పుడు మహిళలు ఆర్తిక శక్తిగా ఎదుగుతున్నారు
* అద్భుతమైన నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతున్నాం
* ప్రపంచమంతా అమరావతి గురించి మాట్లాడే రోజొస్తుంది- చంద్రబాబు
* యూనైటెడ్‌ నేషన్‌తో ఎంఓయూ చేసుకుని..
* ప్రకృతి సేద్యంలో ముందుకు సాగుతున్నాం
* ప్రభుత్వసేవలన్నీ ఒక్క యాప్‌లో అయిపోవాలన్నదే నా కల
* అలాంటి యాప్‌తో అవినీతి అనేదే కనిపించకుండా పోతుంది
* కొత్త విషయాలు నేర్చుకోవాలన్నదే నా తపన
* ప్రపంచంలో తెలుగువారు ట్రెండ్‌ సెట్‌ చేశారు