సర్ ప్రైజింగ్ న్యూస్.. ఎన్టీఆర్, త్రివిక్రమ్ యాంకరింగ్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తోన్న మోస్ట్ క్రేజీయొస్ట్ ప్రాజెక్ట్ అరవింద సమేత వీరరాఘవ. ఈ మూవీ ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం మిగిలిన రెండు పాటల చిత్రీకరణ కోసం చిత్ర యూనిట్ విదేశాల్లో ఉంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇక రీసెంట్ గా విడుదల చేసిన ఆడియో సాంగ్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. కొందరు ఇవి ఎన్టీఆర్ ఇమేజ్ కు భిన్నంగా ఉన్నాయంటున్నారు. కానీ ఇమేజ్ కు తగ్గట్టుగానే ఉంటే ఈ కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ రొటీన్ గా మిగిలిపోతుంది కదా.. అందుకే ఆ క్రేజ్ ను డబుల్ చేసేలా ఈ సినిమా ఉండబోతోందని వినిపిస్తోంది.

ఇప్పటి వరకూ నాలుగు పాటలు విడుదల చేశారు. అయితే ఈ మూవీలో మరో పాట కూడా ఉందంటున్నారు. అంటే ఐదో సాంగ్. ఇది సినిమాలోనే చూడాలట. నిజానికి ఇప్పటి వరకూ వచ్చిన పాటలు చూస్తే ఇందులో ఎన్టీఆర్ టైప్ స్టెప్స్ ఎక్స్ పెక్ట్ చేయలేం. అందుకే ఆయన కోసం అదిరిపోయే మాస్ బీట్స్ రెడీ చేస్తున్నాడట తమన్. అంటే ఈ పాటలో యంగ్ టైగర్ డ్యాన్సింగ్ టాలెంట్ చూపిస్తాడన్నమాట.

ntr

ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను అక్టోబర్ ఫస్ట్ వీక్ లో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్శాతలు. అయితే ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో యాంకర్స్ గా త్రివిక్రమ్, ఎన్టీఆరే వ్యవహరిస్తారని వినిపిస్తోంది. అఫ్ కోర్స్ నామమాత్రంగా ఓ యాంకర్ వేదికపై ఉన్నా.. ఈ ఇద్దరే ప్రధానంగా ఇన్సియేషన్ తీసుకుంటారనీ.. వేదిక మొత్తం ఈ ఇద్దరే కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే యంగ్ టైగర్ హోస్ట్ గా అదుర్స్ అనిపించుకున్నాడు. ఇటు త్రివిక్రమ్ కూడా స్టేజ్ అంటే కొట్టిన పిండే. మరీ ఈ ఇద్దరూ కలిసి యాంకరింగ్ చేస్తే ఆ ప్రీ రిలీజ్ ఫంక్షన్ పీక్స్ లోకి వెళుతుందనటంలో సందేహమే లేదు. మరో విశేషం ఏంటంటే ఈ ఇద్దరూ కలిసి అదే స్టేజ్ పై అభిమానులకు ఓ సర్ ప్రైజింగ్ న్యూస్ కూడా చెప్పబోతున్నట్లు సమాచారం.