నవ్యాంధ్రలో ప్రతిష్టాత్మక సంస్థల పెట్టుబడి

ఏపీ సీఎం చంద్రబాబు అమెరికా పర్యటనలో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి.. పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ కంపెనీలు ముందుకొస్తున్నాయి.. రెండోరోజు పర్యటనలో పలువురు ప్రముఖులతో సమావేశం నిర్వహించిన చంద్రబాబు.. రాష్ట్రంలో వున్న వనరులను వివరించారు.

నవ్యాంధ్రలో సముద్ర సంబంధిత పరిశోధన-అభివృద్ధి విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు డోయెర్ సంస్థ ముందుకొచ్చింది. రెండోరోజు పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు.. డీప్‌ ఓషన్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ సంస్థ ముఖ్య కార్యనిర్వాహక అధికారి లిజ్‌టేలర్‌తో సమావేశమయ్యారు. సముద్ర సంబంధిత సాంకేతిక పరిశోధనలపై శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులకు శిక్షణ అందించేందుకు ఆరంభంలో 200 కోట్లు వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నట్లు డోయెర్‌ సీఈవో లిజ్‌ టేలర్‌ తెలిపారు. డోయెర్‌ అభివృద్ధి చేసిన శాస్త్ర సాంకేతికతను ఏపీకి అందిందచడం ద్వారా అద్భుతాలు సృష్టించవచ్చని ఇరువురు అభిప్రాయపడ్డారు. డోయెర్‌ భాగస్వామ్యంతో ఏపీలో చిన్న తరహా ఓడరేవుల ఆధునీకరణ, అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడతాయని అధికారులు చెబుతున్నారు.

ఇక రాష్ట్రంలో తయారీ రంగానికి సంబంధించిన కంపెనీల్లో పెట్టుబడులు ప్రోత్సహించేలా ప్రత్యేక నిధి ఏర్పాటు దిశగా ఆర్డర్ ఈక్వీటీ పార్టనర్స్‌కు చెందిన రమణ జంపాలతో సీఎం చంద్రబాబు చర్చలు జరిపారు. ఈ ఈక్విటీ భాగస్వాములు ప్రముఖ తయారీ సంస్థలను ఆంధ్రప్రదేశ్‌కు రప్పించేలా చొరవ చూపుతారు. రాష్ట్రంలో తమ సంస్థలు ఏర్పాటు చేసేందుకు 200 కోట్ల ఉమ్మడి భాగస్వామ్య నిధిని ఏర్పాటు చేస్తారు. పోర్ట్ ఫోలియో కంపెనీలు తమ తయారీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏపీకి తరలించేలా చర్యలు చేపడతారు.

ఈ ఉమ్మడి భాగస్వామ్యం ప్రయత్నం వల్ల రాష్ట్ర ఆర్థికరంగం గణనీయంగా అభివృద్ధి చెందుతుంది. 20వేల వరకు ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదన ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఉన్న తయారీరంగ సంస్థలు సుమారు 20 వరకు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి మార్గం సుగమం అవుతుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రెండు గ్రీన్ ఫీల్డ్ తయారీరంగ సంస్థలు ఇక్కడ తమ కార్యకలాపాలను ప్రారంభించే అవకాశం ఉంది. విధివిధానాలపై చర్చించిన ముఖ్యమంత్రి భవిష్యత్తులో ఈ భాగస్వామ్యం మరింత ప్రయోజనకారిగా ఉండేలా చొరవ చూపాలని ఆర్డర్ ఈక్విటీ పార్టనర్స్‌ను కోరారు.

ఏపీలో పెద్ద ఎత్తున రిసార్టులు ఏర్పాటు చేయడానికి వి-రిసార్ట్ సంస్థ ముందుకొచ్చింది. ఆ సంస్థ సీఈవో అదితి బల్బీర్, మాసివ్ ఎర్త్ ఫండ్ సీఈవో శైలేష్ సింగ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ప్రకృతి వ్యవసాయం ప్రతిబించేలా రిసార్టులను వినూత్న రీతిలో ఏర్పాటు చేసే ప్రతిపాదనలపై చర్చించారు. ఈ రిసార్టులలో వెల్ నెస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఒక ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించాలన్నారు. వీటిని విజయవంతంగా నిర్వహించడానికి శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించాలని సమావేశంలో చర్చించారు. దాదాపు 100 రిసార్టులు రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి వి-రిసార్ట్‌ సంస్థ ఆసక్తి కనబరిచింది.

అంతకుముందు ఐక్యరాజ్యసమితి ఆఫీస్‌లో యుఎన్ ఉమెన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్‌తో చంద్రబాబు భేటీ అయ్యారు. రిటైల్ బ్యాంకింగ్ సంస్థ బీఎన్‌పీ పరిబాస్ CEO జీన్ లారెంట్ బొన్నాఫే తో ప్రత్యేకంగా చర్చించారు. ఏపీలో పెట్టుబడి అవకాశాలను వివరించారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.