సెక్సీ పిక్స్‌.. యూత్ టెంప్ట్ అయ్యారో..

డేటింగ్ సైట్స్ తో అబ్బాయిల‌కు వ‌ల.. సెక్సీ పిక్స్ తో యువకులను ముగ్గులోకి దింపుతారు.. యూత్ టెంప్ట్ అయ్యారో… ఇక అంతే సంగ‌తి మీ డబ్బులు గుల్లైన‌ట్టే.. ఇంట‌ర్ నెట్ సాక్షిగా డేటింగ్ సైట్ స‌ర్వీజ్ పేర్ల‌తో నిండా ముంచుతున్నారు..తస్మాత్ జాగ్ర‌త్త..! సరిగ్గా ఇలాంటి గ్యాంగ్ వ్య‌వ‌హారమే ఒక‌టి సైబరాబాద్ లో వెలుగు చూసింది. వెస్ట్ బెంగాల్లో షూర్ చేసి ఇప్పుడూ ఇండియా వైడ్ గా ఆ గ్యాంగ్ చీటింగ్ చేస్తూ సొమ్ము చేసుకుంటుంది.

మోసం పోయేటోడు ఉన్నంత కాలం మోసం చేసే వాళ్లుపుట్టుకొస్తారు అనడంలో ఎలాంటి డౌట్ లేదు. అమ్మాయిల‌తో డేటింగ్ అంటూ నెట్ లో స‌ర్చ్ చేస్తున్న వారిని టార్గెట్ గా ఘరాన మోసానికి తెర‌లేపింది ఓ ముఠా. డేటింగ్ సైట్ల ముసుగులో అమాయ‌కుల‌ను నిండా ముంచి సొమ్ము చేసుకుంటున్నారు. యూత్ టార్గెట్ చేసుకుని ఇంట‌ర్ నెట్ లొ డ‌బ్యూడ‌బ్ల్యూ డాట్ గెట్ యూవ‌ర్ లేడీ, వ‌ర్డ్ డాట్ కామ్, మైల‌వ్ డాట్ కామ్ ఇలా వివిధ పేర్ల‌తో డేటింగ్ సైట్ల‌ను క్రియోట్ చేసి యువతుల ఫోటోల‌ను అప్లోడ్ చేస్తూ.. అబ్బాయిల‌ను నిండా ముంచుతున్నారు. సెక్సీ పిక్స్‌తో యువ‌త‌ను ముగ్గులోకి దింపి చేబులను గుళ్ల చేస్తున్నారు. ఇలా ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు వేల సంఖ్య‌లో బాదితుల‌ను బుట్ట‌లోవేసుకున్న ఘ‌రాన డేటింగ్ స‌ర్వీస్ రాకెట్ కు చెక్ పెట్టారు సైబ‌రాబాద్ సైబ‌ర్ క్రైమ్ పోలీసులు. అదుపులోకి తీసుకుని విచారించ‌డంతో ఇంట్రెస్టింగ్ అంశాలు వెలుగు చూశాయి.

వెస్టు బెంగాల్ అడ్డాగా డేటింగ్ సైట్ స‌ర్వీస్ ను రూపొందించారు. ముందుగా ప‌శ్చిమ బెంగాల్ కు ప‌రిత‌మైనా ఈ సైట్ ఇండియా వ్యాప్తంగా ప్ర‌మోట్ చేస్తూ డ‌బ్బుల‌ను పొందుతున్నారు. ఏకంగా 20 కాల్ సెంట‌ర్ల‌ను బ్రాంచ్ ల వారిగా ఏర్పాటు చేసి డేటింగ్ కోసం పాట్న‌ర్ల‌ను వెతుకుతున్న వారినే లక్ష్యంగా కాల్ సెంట‌ర్ టెలికాల‌ర్స్ తో ఫోన్లు మాట్లాడుతూ వేల సంఖ్య‌లో బాధితుల‌కు టోక్ర ఇచ్చారు. డేటింగ్ కోసం స‌ర్చ్ చేసే సైట్ల‌లో నెంబ‌ర్ల‌ను సేకరించి ఆయా లోక‌ల్ ఎరియా ఫోన్ నెంబ‌ర్ల‌తో లేడీ టెలికాల‌ర్స్ తో కాల్ మాట్లాడిస్తూ క‌స్ట‌మ‌ర్ల‌ను త‌మ బుట్ట‌లో వేసుకుంటున్న‌ట్లు పోలీసుల ఇంట‌రాగేష‌న్ లో వెలుగు చూసింది. విక్టిమ్ పార్టీ ఒక్క సారి క‌నెక్ట్ అయితే చాలు స‌ద‌రు వ్య‌క్తిని ట్రాక్ చేయ‌డానికి ద‌ఫ‌ల వారిగా లేడీ టెలి కాల‌ర్స్ ను మార్చూతూ క‌స్ట‌మ‌ర్ ను అనుమానం రాకుండా జాగ్ర‌త్త తీసుకుంటు ప్రీప్లాన్ గా మోసాల‌కు పాల్ప‌డుతున్నారు.

పశ్చిమ బెంగాల్ కు చెందిన మొత్తం ఐదు గురు ముఠా గా ఏర్పడి 20 కాల్ సెంట‌ర్ల‌ను న‌డిపిస్తున్న‌ట్లు పోలీసుల ద‌ర్యాప్తు తేలింది. కీల‌క సూత్ర‌దారి దెబ‌షిశ్ ముఖ‌ర్జీ ముందుగా సిలిగురి లో 12 బ్రాంచ్ ల‌ను, కోల్ క‌త్త‌లో 12 బ్రాంచ్ ల‌ను ఏర్పాటు చేశాడు. త‌న‌తోపాటూ ఫైజ‌ల్ హ‌ఖ్, సందీప్ మిత్ర తో పాటూ మ‌రో ఇద్ద‌రు మ‌హిళ‌లు అనితా డే, నీతా శంఖ‌ర్ లు క‌లిసి ఆయా బ్రాంచ్ ల‌ను ర‌న్ చేస్తున్న‌ట్లు పోలీసులు గుర్తించారు. హైద‌రాబాద్ కు చెందిన బాదితుడు ఫిర్యాదు చేయ‌డంతో భారీ రాకెట్ కు చెక్ పెట్టిన‌ట్లు సీపీ స‌జ్జ‌న‌ర్ తెలిపారు. డేటింగ్ పాట్న‌ర్ కోసం స‌ర్చ్ చేసిన కారణంగా ముఠా స‌భ్యులు మెంబ‌ర్ షిప్ ఫీ.. క్ల‌బ్ ఫీ, లైసెన్స్ ఫీ, రిజిస్ట్రేష‌న్ ఫీ, స‌ర్వీస్ ఛార్జ్ ఇలా వివిధ ఫీజ్ ల‌తో 15 ల‌క్ష‌ల వ‌ర‌కు గ్యాంగ్ స‌భ్యులు పొందిన‌ట్లు బాదితుడు పోలీసుల‌కు కంప్లైట్ చేశాడు.

బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో సైబ‌ర్ క్రైమ్ పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు ప్రారంభించారు. దీంతో కోల్‌క‌త్త లోని 20 బ్రాంచ్ ల బాగోతం వెలుగులోకి వ‌చ్చింది. కేవ‌లం డేటింగ్ కోసం సైట్ల‌తో వెతుకుతున్న వారినే ప్ర‌ధానంగా డేటింగ్ రాకెట్ లోని నిందితులు చీట్ చేసిన‌ట్లు పోలీసులు గుర్తించారు. బాదితులు ఇండియా వైడ్ గా ఉన్న‌ట్లు అంచ‌న వేస్తున్నారు. ఎది ఎమైన ఇలాంటి కేటుగాళ్ల‌తో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని. డేటింగ్ పేర్ల‌తో వెలుస్తున్న సైట్ల ను న‌మ్మొద‌ని కోరుతున్నారు. బాదిత‌లు ఎవ‌రైనా ఉంటే స్థానిక పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వాలని స్ప‌ష్టం చేస్తున్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.