ఎన్టీఆర్ బయోపిక్‌లో పురందేశ్వరి..

మహానటిలో సావిత్రిని ఆవిష్కరించారు. ఆమె జీవితాన్ని కళ్లకు కట్టిన తీరు దర్శకుడి ప్రతిభకు అద్దం పడుతుంది. ఇప్పుడు మహానటుడు మాజీ ముఖ్యమంత్రి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావుని తెరపైకి తీసుకొస్తున్నారు డైరక్టర్ క్రిష్.

ఆయన జీవిత విశేషాలతో పాటు, తోటి సహచర నటీనటులను కూడా తెరపైకి తీసుకొస్తున్నారు. ఎన్టీఆర్ కుటుంబసభ్యులు కూడా ఈ చిత్రంలో ఉండబోతున్నట్లు సమాచారం. కూతురు పురందేశ్వరి పాత్ర కోసం విజయవాడకు చెందిన హిమాన్సి చౌదరి అనే డ్యాన్సర్ ఆమె పాత్రలో కనిపించోతున్నట్లు తెలుస్తోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీరిద్దరి ఫొటోలు చూస్తుంటే అచ్చంగా పురందేశ్వరిలానే అనిపిస్తుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. నాగేశ్వరరావు పాత్ర కోసం సుమంత్, చంద్రబాబు పాత్ర కోసం రానా కూడా ఆయా పాత్రల్లో ఒదిగిపోయినట్లుగా ఫోటోలు చూస్తే అర్థమవుతోంది.