బిగ్‌బాస్.. దేవదాస్.. మధ్యలో నలిగిన నానీ.. ఛలో కాశీ అంటూ

ఓ వైపు బిగ్‌బాస్ మరో వైపు దేవదాస్.. ఇద్దరూ బుర్ర హీటెక్కించారు. బాబోయ్ నావల్ల కాదు.. ఛలో కాశీ అంటున్నాడు నేచురల్ స్టార్. సినిమాల్లోనే కాదు, హోస్ట్‌గా కూడా సక్సెస్ అయ్యాడు నానీ. యాంకరింగ్ చేయడం మొదటిసారే అయినా ప్రతి విషయాన్ని ఓన్ చేసుకుని తప్పు చేస్తే సీరియస్‌గా మందలిస్తూ, బాగా చేస్తే మెచ్చుకుంటూ మొత్తానికి నానీ హోస్టింగ్ సూపర్ అనిపించుకున్నారు. బుల్లితెర ప్రేక్షకుల అభిమానాన్ని గెలుచుకున్నారు.

దేవదాస్ చిత్రం గురించి వివరిస్తూ తన క్యారెక్టర్ దాస్ చాలా ఇన్నోసెంట్. సాఫీగా సాగుతున్న లైఫ్‌లోకి ఓ వక్తి ఫ్రెండ్‌గా వస్తే వాడి లైఫ్ ఎలా మారిపోతుంది అనేది చిత్ర సారాంశం అన్నారు. తానెప్పుడూ చేతిలో ఫోన్ పట్టుకుని ఉంటానని నాగార్జున వీడియో చేసారు. కానీ ఆయన పక్కన ఉన్నప్పుడు అలాంటి ధైర్యం చేయలేదన్నారు. ఇక తన జీవితంలో అత్యంత ఒత్తిడికి గురవుతున్న వీకెండ్ అంటే ఇదే అన్నారు. ఆతృతతో పాటు ఆసక్తిగా కూడా ఉన్న వారం ఇదే అన్నారు. కారణం బిగ్‌బాస్ ఫైనల్ కూడా ఇదే వారం ఉండడంతో ఒత్తిడి ఎక్కువగా ఉందన్నారు. ఈ వారం అయిపోతే కొన్ని రోజులు ఏ కాశీకో వెళ్లిపోతాను అని సరదాగా నవ్వుతూ అన్నారు నానీ.