డేటింగ్ సర్వీస్.. అమ్మాయిలతో గడుపుతారా అంటూ..

డేటింగ్,ఎస్కార్ట్ సర్వీస్ ల పేరుతో దేశంలోని అమాయకులను మోసం చేస్తున్న150 కోట్లు వసూలు చేసిన ఐదుగురు వ్యక్తుల ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. వెస్ట్ బెంగాల్ లో 20 కాల్ సెంటర్ లను ఏర్పాటు చేసి అమ్మాయిలతో గడపాలంటే మెంబర్ షిప్, క్లబ్ లైసెన్స్ రిజిస్ట్రేషన్ ఫీ, జీఎస్టీ, కింద వేల మంది నుంచి కోట్లు వసూలు చేశారు. అయితే కేవలం ఒక వ్యక్తి దగ్గర నుంచి 15 లక్షలు వసూలు చేయడం విశేషం. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన సైబర్‌ క్రైం పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. కేసులో కీలకమైన మరో ముగ్గురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.