హెచ్చరిక.. భారీ వర్షాలు.. 30 మంది మృతి.. మరో 36 గంటలు..

kerala-rains-live-updates-26-dead-in-heavy-rains-kochi-on-high-alert-as-more-shutters-of-idukki-dam-opened
భారీ వర్షాలు ఉత్తరాదిని అతలాకుతలం చేస్తున్నాయి. హిమాచల్‌ ప్రదేశ్‌, జమ్మూ కశ్మీర్‌, హర్యానా రాష్ట్రాల్లో భారీ వర్షాలు భయపెడుతున్నాయి. ఈ వరదల కారణంగా దాదాపు 30 మంది మృతి చెంది ఉంటారని అంచనా వేస్తున్నారు. మరో 36 గంటల పాటు ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కేదార్‌నాథ్‌, యమునోత్రి యాత్రికులకు ముందుస్తు హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్ష సూచన ఉండటంతో వరదలు సంభవించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎన్డీఆర్‌ఎఫ్‌ దళాలను రంగంలోకి దింపుతున్నట్లు అధికారులు తెలిపారు.

 

ఉత్తరాదిన కురుస్తున భారీ వర్షాలకు వివిధ ప్రాంతాల్లో 30 మందికి పైగా మృతి చెందారు. కొండచరియలు విరిగిపడడంతో కొండ ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు. హిమచల్‌ ప్రదేశ్‌లోని బీయాస్‌ నది తీవ్ర ఉదృతంగా ప్రవహిస్తుడడంతో పలు రాష్ట్రాల్లో ఇప్పటికే హై అలర్టు ప్రకటించారు.

అధికారికంగా హిమాచల్‌ ప్రదేశ్‌లో 8 మంది, జమ్ముకశ్మీర్‌లో ఏడుగురు, పంజాబ్‌లో ఆరుగురు, హరియాణాలో నలుగురు పైగా మృత్యువాతపడ్డారని తెలుస్తోంది. హిమాచల్‌ ప్రదేశ్‌లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. భారీ వర్షాలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కుల్లు జిల్లాలో హైఅలర్ట్‌ ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న బియాస్‌ నదిలో మనాలీ ప్రాంతంలో ముగ్గురు గల్లంతయ్యారు. వీరి వాహనం నదిలో కొట్టుకుపోవడంతో ఈ ఘటన జరిగింది. హిమాచల్‌ ప్రభుత్వ అభ్యర్థనతో భారత వాయు సేనకు చెందిన హెలికాప్టర్‌ను కుల్లు నుంచి అత్యవసర సేవలు అందించేందుకు సిద్ధంగా ఉంచారు. వర్షాల కారణంగా చంబా, కుల్లు, శ్రీమౌర్‌, కంగ్రా, హమిర్‌పూర్‌ జిల్లాల్లో విద్యాసంస్థలను మూసేశారు.