ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రముఖ సింగర్‌ కుమార్తె మృతి..

మలయాళ ప్రముఖ సంగీత దర్శకుడు బాలభాస్కర్ కుటుంబం ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆయన ముద్దుల కూమార్తె తేజస్వి మరణించడం తీవ్ర విషాదాన్నినింపింది. బాలభాస్కర్, ఆయన భార్య లక్ష్మి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. త్రిస్సూర్‌లో ఓ దేవాలయాన్ని దర్శించుకొని తిరిగి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. డ్రైవర్‌ నిద్రమత్తులో కారును చెట్టుకు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.

మలయాళ చిత్రపరిశ్రమలో అతి చిన్నవయసున్న సంగీత దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు బాలభాస్కర్‌. 12 ఏళ్ళ వయస్సులో సంగీత దర్శకుడిగా కరియర్‌ను ప్రారంభించిన బాల స్టేజీ షోలతో సింగర్‌గా, వయోలినిస్ట్‌గా మరింత పాపులర్‌ అయ్యారు. ‘మాంగల్య పల్ల’, ‘మోక్షం’, ‘కన్నదిక్కదవతు’ అనే మూవీలకు సంగీతం అందించారు బాల.