శ్రీకాంత్‌ అడ్డాల నెక్ట్స్‌ మూవీలో హీరో నాని కాదు..

‘కొత్త బంగారు లోకం’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘ముకుంద’ లాంటి హిట్ మూవీలను టాలీవుడ్‌కు అందించిన దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల. బ్రహ్మోత్సవం మూవీ డిజాస్టర్ టాక్ రావడంతో ఈ దర్శకుడు కెరీర్‌ ఇబ్బందుల్లో పడింది అనుకున్నారంతా. ఈ మూవీ రిలీజ్ అయిన తర్వతా రెండేళ్లు గ్యాప్‌ తీసుకున్నాడు శ్రీకాంత్. ఇప్పుడు గీతా‌ ఆర్ట్స్‌ బ్యానర్‌లో ఓ సినిమాను తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు. అయితే ఈ మూవీలో హీరోగా నాని, అల్లుశిరీష్ పేర్లు ఇటీవల టాలీవుడ్‌లో తెగ హల్‌చల్ చేశాయి. ఇప్పుడు తాజాగా మరో హీరో పేరు తెరపైకి వచ్చింది. శ్రీకాంత్‌ అడ్డాల నెక్ట్స్‌ మూవీలో హీరో నాని, అల్లుశిరీష్ కాదని.. ఈ మూవీలో హీరోగా శర్వానంద్ నటిస్తున్నాడంటూ సినీపరిశ్రమల్లో బలంగా వినిపిస్తోంది.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.