తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి

తిరుమల శ్రీవారిని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం నైవేధ్య విరామ సమయంలో కుటుంబ సమేతంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో నుండి ఆలయంలోకి ప్రవేశించి స్వామి సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.అనంతరం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేసిన తర్వాత ఆలయ అధికారులు స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కుంటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.