కృష్ణాజిల్లాలో సుడిగాలి బీభత్సం

కృష్ణాజిల్లా జిల్లాలో సుడిగాలి బీభత్సం సృష్టించింది. కోడూరు మండలం పిట్టల్లంక గ్రామంలో భీకర గాలులు ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. ఈ గాలుల దెబ్బకు చెరువుల్లోని నీళ్లు ఎగిసిపడ్డాయి. సుడులు తిరుగుతూ నీరు పైకి లేవడంతో.. ఏం జరుగుతుందో అర్థంకాక స్థానికులు భయాందోళనకు గురయ్యారు.