నా నియోజకవర్గంలో నేనే హీరో.. బాక్సులు బద్దలవుతాయి జాగ్రత్త : చింతమనేని

dendhuluru mla chinthamaneni prabhakar fire on pawan kalyan

పవన్ కళ్యాణ్‌ పిట్టకథలు చెప్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అన్నారు. సొంత అన్ననే గెలిపించుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. జనసేనాని తనపై చేసిన ఆరోపణలకు చింతమనేని బదులిచ్చారు. 1996లో చంద్రబాబు హయాంలోనే తనపై రౌడీషీట్‌ ఓపెన్‌ చేశారని గుర్తుచేశారు. ఆ విషయం ప్రజలకు తెలుసన్నారు. నా నియోజకవర్గంలో నేనే హీరో అంటూ పవన్‌కు గట్టిగా బదులిచ్చారు. జనసేనాని తనపై చేసిన ఆరోపణలపై చర్చకు సిద్ధపడాలని చింతమనేని సవాల్‌ విసిరారు. ఓ ఫ్లాప్ సినిమా చూశామని పవన్ వ్యాఖ్యల్ని లైట్‌ తీసుకోండని కార్యకర్తలకు చెప్పనని అన్నారు. తన రెండో యాంగిల్ చూస్తే బాక్సులు బద్ధలవుతాయంటూ పవన్‌ని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారాయన.