బిగ్‌బాస్‌ 2 టైటిల్‌.. గీతా మాధురి..

బిగ్ బాస్.. ఇప్పుడు తెలుగురాష్ట్రాల్లో హీట్‌ పుట్టిస్తున్న సబ్జెక్ట్. గ్రామాలు, పట్టణాలు తేడా లేదు.. ఏ ఇద్దరు కలిసినా.. ఎవరు విన్నర్.. మరెవరు రన్నర్ ఇదే చర్చ. సామాన్యుల నుంచి ప్రముఖుల దాకా అందరిలో ఇదే టెన్షన్‌. టీవీ రియాల్టీ షో అయినా.. జనాల్లో మాత్రం వాళ్ల ఇంటిలో గేమ్ జరుగుతున్నట్టుగా ఫీల్ అవుతున్నారు. బిగ్ బాస్ -2 షో ముగింపు దశకు వచ్చింది.

బిగ్‌బాస్‌ 2 టైటిల్‌ గెలిచే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న కంటెస్ట్‌ పేరు గీతా మాధురి. సింగర్ గీతా మాధురి ఇప్పుడు బిగ్‌ బాస్ 2 టైటిల్ కోసం పోటీపడుతుంది. పేరుకు తగ్గట్లే మధురమైన గీతాలాపనతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇటు వెండితెర, అటు బుల్లితెర ప్రేక్షకులకు గీతా మాధురి సుపరిచితమే. ఆమె పాటనే కాదు… మాట కూడా ప్రత్యేకమే. బిగ్‌బాస్‌ హౌస్‌లో ఆమె ప్రవర్తనే ఇందుకు నిదర్శనం. ప్రతి ఒక్కరిలో లోపాలు ఉంటాయి. తప్పు చేయని మనిషే ఉండడు. వాటిని ఎత్తిచూపి సరిదిద్దుకునే ప్రయత్నం కొందరే చేస్తారు. అలాంటి వారిలో గీతామాధురి ఒకరు. ఒక కుటుంబసభ్యురాలిగా బిగ్‌ బాస్ హౌస్‌లో తోటి సభ్యుల పట్ల ఆమె ప్రవర్తించే తేరు అందరినీ ఆకట్టుకుంటోంది. తప్పులను ఎత్తిచూపితే ఎదుటి వ్యక్తుల నుంచి నెగెటివ్ రియాక్షన్ వస్తుందని తెలిసినా ఆమె తన ప్రవర్తన మార్చుకోలేదు.

ఎదుటివారి పట్ల నిజాయతీగా ఉండడమే గీతామాధురి బలం. ఎవరేమనుకున్నా సరే ఉన్నది ఉన్నట్లు చెప్పడమే ఆమె నైజం. చివరికి తప్పుల విషయంలో కౌశల్‌ని కూడా నిలదీసింది. కౌశల్ ఆర్మీ గురించి తెలిసినా ఆమె ఏమాత్రం బయపడలేదు. గీతా మాధురిలో ఉన్న ముక్కుసూటిదనం… ఆమెను ఫైనల్స్‌కు చేరేలా చేసింది.

బలాలతోపాటే బలహీనతలూ ఉంటాయి. గీతా మాధురి కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. మాటలు, ప్రవర్తనతో ఆకట్టుకునే గీతా మాధురి… ఫిజికల్ టాస్కుల విషయంలో వెనుకబడింది. కొన్నిసార్లు తన అభిప్రాయాలను స్పష్టంగా చెప్పలేకపోయింది. ఇదే ఆమెకున్న పెద్ద బలహీనతా భావిస్తున్నారు.