బిగ్‌బాస్ 2 షోలో హీరో.. తనీష్‌కు ఉన్న బలం..

tanish, nani

బిగ్‌బాస్ 2 షోలో హీరో తనీష్ ఫైనల్‌కు చేరారు. ఐదుగురు కంటెస్టెంట్‌లలో తనీష్ ఒకరు. బాల నటుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన తనీష్… హీరోగా హిట్‌ సినిమాలను అందించారు. బిగ్‌ బాస్ 2 షోలో పాల్గొని ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. బిగ్‌ బాస్ హౌస్‌లో తోటి సభ్యులతో ప్రవర్తించే తీరుపై భిన్నాభిప్రాయలు వ్యక్తమయ్యాయి.

కోపంతో కొందరి మనసు నొప్పించినా… త్యాగంలో ఎవరూ సాటిరారని నిరూపించుకున్నాడు. ఆటకంటే స్నేహం, అనుబంధాలు ముఖ్యం అని నిరూపించాడు ఈ హీరో. తనవాళ్ల కోసం ఏమైనా చేయగలిగే, ఏదైనా త్యాగం చేయగలిగే మనస్తత్వం తనీష్‌ది. ఇదే చాలామంది అభిమానాన్ని సంపాదించి పెట్టింది.

తనీష్‌లోనూ ప్లస్‌లు, మైనస్‌లు ఉన్నాయి. బంధాలకు విలువివ్వడమే తనీష్‌కు ఉన్న బలం. ఇతరుల కోసం త్యాగం చేయడం కూడా తనీష్‌కు ప్లస్ పాయింట్. ఓ ఆటలో భాగంగా తను గెలవాల్సిన సందర్భంలో మరో హౌస్‌మేట్‌ దీప్తి సునయనను గెలిపించాడు. తన విజయాన్ని ఆమె కోసం తృణప్రాయంగా త్యాగం చేశాడు.

తనీష్‌లో బలంతోపాటు బలహీనతలూ ఉన్నాయి. కోపమే అతడి అతిపెద్ద బలహీనత. కోపాన్ని నియంత్రించుకోలేడు. భావోద్వేగాలను అదుపులో పెట్టుకోకపోవడమే పెద్ద మైనస్. కోపం వచ్చినప్పుడు హౌస్‌మేట్స్‌తో అతడు ప్రవర్తించిన తీరుపై విమర్శలు వచ్చాయి.