బిగ్‌ బాస్ 2 ఫైనల్‌.. పదిసార్లకుపైగా నామినేట్.. ఫేక్ ఓటింగే కారణం?

బిగ్‌ బాస్ 2 ఫైనల్‌కు చేరిన కంటెస్టెంట్లలో దీప్తి నల్లమోతు ఒకరు. యాంకర్‌ కం రిపోర్టర్‌గా తెలుగు ప్రజలకు సుపరిచితమే. శంకర్ దాదా ఎంబీబీఎస్, భద్ర వంటి సినిమాల్లోనూ నటించింది. ప్రస్తుతం బిగ్‌బాస్ 2 షోలో పాల్గొని ఫైనల్స్‌కి చేరింది.

గెలుపే లక్ష్యంగా ఆడుతున్న దీప్తి… హౌస్ మేట్స్ అందరితోనూ కలివిడిగా ఉండడం ఆమెకు కలిసి వస్తోంది. ఎవరినీ ఒక్క మాట కూడా అనకుండా తటస్థంగా చాలా జాగ్రత్తగా ఆడుతోంది. అయితే ఎదుటివారు ఏదైనా అంటే మాత్రం తన హావభావాలను దాచుకోలేదు. ఎవరూ ఊహించని విధంగా ఫైనల్స్‌కు చేరిన దీప్తి… విన్నర్‌గా నిలుస్తుందా లేదా అనేది ఆసక్తిగా మారింది.

ప్రతి ఒక్కరికీ బలం, బలహీనతలు రెండూ ఉంటాయి. అలాగే దీప్తిలోనూ ఉన్నాయి. ఆమె బలం కృషి, పట్టుదల. దీప్తి అసలు ఫైనల్స్‌కి చేరుతుందని ఎవరూ ఊహించివుండరు. ఈ షోలో ఆమెపై పెద్దగా అంచనాలు కూడా లేవు. అయితే కృషి, పట్టుదలతో క్రమంగా పట్టు సాధించింది. గెలుపే లక్ష్యంగా ఆట ఆడింది. తనంటే ఏంటో నిరూపించుకుంది. ప్రతిభ కంటే కృషి, పట్టుదలే ముఖ్యమని చెప్పే దీప్తి… తన విషయంలో నిరూపించుకుంది.

bigg-boss, depthi, naniఎక్కడైనా విజయం సాధించాలంటే బలహీనతలను అధిగమించాలి. దీప్తి బలహీనతలు గెలుపుకు ఆటంకంగా మారే అవకాశం లేకపోలేదు. బిగ్‌బాస్ 2 ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటిదాకా ఎలిమినేషన్‌ కోసం పదిసార్లకుపైగా నామినేట్ అయింది. అయితే ప్రతీసారి తృటిలో తప్పించుకుంది. దీనికి కారణం ఫేక్ ఓటింగే అనే ఆరోపణలు వచ్చాయి.