బిగ్ బాస్ 2.. ముగ్గురు ఔట్.. మిగిలింది ఇద్దరే!

బిగ్‌ బాస్ 2 ఫైనల్స్ భారత్ – పాక్ మ్యాచ్‌ను తలపిస్తోంది. ఫైనలకు చేరిన ఐదుగురు కంటెస్టెంట్లో.. ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు. ఈ సీజన్‌లో గ్రాండ్ ఫినాలేకి వెళ్లిన తొలి కంటెస్టెంట్‌ సామ్రాట్ ఫస్ట్ ఎలిమినేట్ అయ్యాడు. బిగ్ బాస్ హౌస్‌కి తొలి కెప్టెన్, అందరికంటే ముందు ఫైనల్ చేరిన వ్యక్తి, పైనల్ లో బయటకు వచ్చిన తొలి కంటెస్టెంట్‌ కూడా సామ్రాట్‌టే కావడం విశేషం.

సామ్రాట్ తర్వాత మరో ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. సామాట్ర్ తర్వాత దీప్తి నల్లమోతు ఎలిమినేట్ అయినట్టు ప్రకటించారు నాని. అయితే మూడవ కంటెస్టెంట్‌ ఎలిమినేషన్ కాస్త డిఫరెంట్‌గా జరిగింది. సామ్రాట్, దీప్తి బయటకు వచ్చిన తర్వాత మిగిలిన ముగ్గురు తనీశ్, కౌశల్, గీతలు ఒప్పో సెల్ఫీ దిగారు. టీవిలో ఈ రియాల్టీ షో చూస్తున్న వారంతా ఈ గేమ్ వాళ్ల ఇంటిలో జరుగుతున్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అందరిలో ఒకటే టెన్షన్‌. ముగ్గురిలో ఎవరు బయటకు వస్తారా అని.. అందరూ చూస్తుండగానే మిగిలిన ముగ్గురిలో ఒక్కొక్కరిని ఒక్కో చోటుకి పంపించి… సైరన్ మోగించారు. అలా మోగగా… హౌస్‌లో గీత, కౌశల్ ఇద్దరు ప్రత్యక్షమయ్యారు. ఇక మిగిలిన తనీశ్… స్టేజ్ మీద నాని పక్కన కనిపించాడు. ఇక హౌస్‌లో మిగిలింది ఇద్దరు గీత, కౌశల్. వీరిలో విన్నర్ ఎవరా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు.