బిగ్ బాస్ 2 విన్నర్‌ని ప్రకటించిన విక్టరీ వెంకటేష్

బిగ్ బాస్.. ఇప్పుడు తెలుగురాష్ట్రాల్లో హీట్‌ పుట్టిస్తున్న సబ్జెక్ట్. గ్రామాలు, పట్టణాలు తేడా లేదు.. ఏ ఇద్దరు కలిసినా.. ఎవరు విన్నర్.. మరెవరు రన్నర్ ఇదే చర్చ. సామాన్యుల నుంచి ప్రముఖుల దాకా అందరిలో ఇదే టెన్షన్‌. టీవీ రియాల్టీ షో అయినా.. జనాల్లో మాత్రం వాళ్ల ఇంటిలో గేమ్ జరుగుతున్నట్టుగా ఫీల్ అయ్యారు. భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంటే ఎంత టెన్షన్ ఉంటుందో.. అంతకంటే ఎక్కువ ఆతృతగా తెలుగు ప్రేక్షకులు ఫైనల్స్ కోసం ఎదురు చూశారు.

బిగ్‌ బాస్ 2 ఫైనల్స్ భారత్ – పాక్ మ్యాచ్‌ను తలపించింది. ఐదుగురు కంటెస్టెంట్లు మిగిలారు. కౌశల్, దీప్తి, గీతామాధురి, సామ్రాట్, తనీష్ ఫైనల్‌కు చేరారు. కానీ విన్నర్ ఒకరే. ఆ ఒక్కరు ఎవరు? అందరిలో ఒకటే టెన్షన్‌. బిగ్ బాస్ విన్నర్‌గా ఎవరని ప్రకటిస్తారా అని ఆతృతగా ఎదురు చూస్తున్న ప్రేక్షకుల ముందుకు ఫైనలిస్టులు గీత, కౌశల్.. ఈ ఇద్దరినీ నాని స్వయంగా స్టేజి మీదకు తీసుకువచ్చారు. అయితే ఈ షోకి గెస్ట్‌గా వచ్చిన విక్టరీ వెంకటేష్ విజేతను ప్రకటించారు.

బిగ్ బాస్ టైటిల్‌ను కౌశల్ మందాకు ప్రకటించారు విక్టరీ వెంకటేష్. దీంతో గీతా మాధురి రన్నరప్‌గా నిలిచింది. హౌస్ నుంచి బయటకు వచ్చేటప్పుడు గీత మాధురి తీవ్ర ఉద్వేగానికి గురై.. కన్నీళ్లు పెట్టుకుంది.

బిగ్ బాస్ 2 ఫైనల్‌కు చేరిన కంటెస్టెంట్‌లలో బాగా వినిపించిన పేరు కౌశల్. బుల్లితెర ప్రేక్షకులకు కౌశల్ బాగా తెలుసు. బిగ్ బాస్‌2తో చాలా పాపులారిటీ వచ్చింది. గెలవడమే లక్ష్యంగా ఆట మొదలుపెట్టిన కౌశల్… ఫైనల్స్‌కి చేరేదాకా అదే తీరు కంటిన్యూ చేశాడు. గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న కౌశల్‌నే బిగ్ బాస్ టైటిల్‌ వరించింది.