బిగ్ బాస్ 2 విన్నర్.. కౌశల్‌కి పెద్ద మైనస్ ఇదే!

బిగ్ బాస్ 2 ఫైనల్‌కు చేరిన కంటెస్టెంట్‌లలో బాగా వినిపిస్తున్న పేరు కౌశల్. బుల్లితెర ప్రేక్షకులకు కౌశల్ బాగా తెలుసు. బిగ్ బాస్‌2తో చాలా పాపులారిటీ వచ్చింది. బిగ్‌బాస్ హౌస్‌లో కౌశల్ ప్రవర్తనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

గెలవడమే లక్ష్యంగా ఆట మొదలుపెట్టిన కౌశల్… ఫైనల్స్‌కి చేరేదాకా అదే తీరు కంటిన్యూ చేశాడు. గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న ఈ కంటెస్టెంట్… ఎవరు ఏమైతే నాకేంటి అనేలా ప్రవర్తిస్తున్నాడనే విమర్శలున్నాయి. బంధాలకు విలువ ఇవ్వకుండా కేవలం గెలుపుకోసమే ప్రయత్నం చేస్తున్నాడనే వాదనా ఉంది. ఇతడి గెలుపుకోసం ఏకంగా కౌశల్ ఆర్మీ పేరుతో ఒక టీం పనిచేస్తున్నట్లు విమర్శలున్నాయి.

కౌశల్‌లో కూడా బలాలు, బలహీనతలు రెండూ ఉన్నాయి. గెలుపే లక్ష్యంగా ఆడుతుండడం అతడికి ఉన్న అతిముఖ్యమైన బలం. బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంటరైనప్పటి నుంచి విజేతగా నిలవడానికే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ కసే అతడిని ఫైనల్‌ వరకు తీసుకొచ్చింది. టాస్కులలో భాగంగా కిరీటి… కౌశల్ కళ్లలో నిమ్మకాయలు పిండి ఏడిపించడం వంటివి ప్రేక్షకుల్లో సింపతీని పెంచాయి.

గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నా… బలహీనతలు కూడా లేకపోలేదు. కొంతమంది మధ్యన ఉన్నప్పుడు వారితో కలుపుగోలుగా ఉంటూనే విజయం కోసం ప్రయత్నించాలి. సంయమనం పాటించాలి. కానీ కౌశల్ ఈ విషయంలో వెనుబడి ఉన్నాడు. తోటి కంటెస్టెంట్లు విసుగు తెప్పించేలా ప్రవర్తిస్తే చాలు నియంత్రణ కోల్పోతాడు. తోటి సభ్యులను కుక్కలతో పోల్చి నోరు జారాడు. దీనిపై చాలా విమర్శలొచ్చాయి. ఇదే అతడికి పెద్ద మైనస్. ఇక ఓవర్‌ కాన్ఫిడెన్స్‌తో మాట్లాడడం కూడా కౌశల్ బలహీనతే.