బిగ్‌ బాస్ 2 విన్నర్.. కౌంట్ డౌన్.. ఐదుగురిలో ఒకరు ఎలిమినేట్

బిగ్‌ బాస్ 2 ఫైనల్స్ భారత్ – పాక్ మ్యాచ్‌ను తలపిస్తోంది. ఐదుగురు కంటెస్టెంట్లు.. కౌశల్, దీప్తి, గీతామాధురి, సామ్రాట్, తనీష్ ఫైనల్‌కు చేరారు. కానీ విన్నర్ ఒకరే. ఆ ఒక్కరు ఎవరు? విజేతగా బిగ్‌బాస్ ఎవరిని ప్రకటించబోతున్నారు? ఇదే ఇప్పుడు అందరిలో ఆసక్తి నెలకొంది. సీజన్‌ వన్‌లో శివబాలాజీ విజేతగా నిలిచి 50 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకున్నారు. ఇప్పుడు ఆ అదృష్టం ఎవరిని వరించబోతోంది? ఇది తేలడానికి కౌంట్ డౌన్ మొదలైంది.

ప్రస్తుతం టైటిల్ రేసులో మరో నలుగురు మాత్రమే మిగిలారు. ఐదుగురిలో ఒకరు ఎలిమినేట్ అయ్యారు. అందరికంటే ముందు ఫైనల్ చేరిన సామ్రాట్ ఎలిమినేట్ అయినట్టు హోస్ట్ నాని ప్రకటించారు. ఆ పేరు చెప్పగానే అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. హౌస్‌ను విడిచి వెళుతూ.. స్విమ్మింగ్ ఫూల్ ఒక్కసారి తనివితీరా చూసుకున్నాడు సామ్రాట్.

 

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.