బిగ్ బాస్.. అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా!

మహరాష్ట్రలోని పూణెకి 64 కిలోమీటర్ల దూరంలో లోనావాలా అనే పట్టణంలోని ఓ అధునాతనమైన ఇంటిలో బిగ్ బాస్ సీరిస్ వన్ జరిగింది. మొత్తం 16 మంది సెలబ్రిటిలతో షో స్టార్ట్ చేశారు. మొత్తం 60 కెమెరాలు అమర్చారు. దీనికి జూనియర్ ఎన్టీయార్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఆయన చేసిన సందడి అంతా ఇంతా కాదు.. వేదికపై నుంచే హౌస్ లో సభ్యులను ఉత్సాహపరిచారు. గత ఏడాది జులై 16న ప్రారంభమైన మొదటి సీరిస్ మొత్తం 71 రోజుల పాటు జరిగింది. ఫైనల్స్ లో శివబాలాజీ, హరితేజల మధ్య గట్టిపోటీ ఎదురైంది. చాలామంది హరితేజ గెలుస్తుందని భావించారు. కానీ చివరకు శివబాలాజీ విజేతగా నిలిచారు.

ఇక ఈ ఏడాది జూన్ 10 నుంచి బిగ్ బాస్ -2 స్టార్ట్ అయింది. ఈ సారి సెట్ హైదరాబాద్ కే వచ్చింది. మహారాష్ట్ర నుంచి తెలంగాణలోని అన్నపూర్ణ స్టూడియోకు మారింది. అన్నపూర్ణ ఏడెకరాల్లో ప్రత్యేకంగా బిగ్ బాస్ ఇంటి సెట్ వేశారు. మొత్తం 18 మంది కంటెస్టెంట్లు షోలో పాల్గొన్నారు. ఏదైనా జరగొచ్చు అన్న ట్యాగ్ లైన్ తో యంగ్ నాచురల్ స్టార్ నాని ఈ షోను హోస్ట్ చేస్తున్నారు. తనదైన స్టైయిల్ లో రియాల్టీ షోను రక్త కట్టిస్తున్నారు నాని. షో మొదట్లో పెద్దగా ఆకట్టుకోలేదన్న విమర్శలు వచ్చాయి. కానీ తర్వాత తర్వాత ఇది పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఆదాయంలో కూడా మొదటి సీరిస్ కంటే ఎక్కువ వచ్చిందని నిర్వాహకులే తెలిపారు.. అటు ఎస్ ఎం ఎస్ లవిషయంలో కూడా రికార్డులు బ్రేకులు చేస్తుంది.. మొత్తానికి ఫైనల్స్ కు చేరుకున్న షో లో విజేతగా ఎవరు వస్తారన్నది ఆసక్తిగా మారింది.