బిగ్‌ బాస్‌ షో.. సామ్రాట్ నిర్లక్ష్యంగా..

బిగ్‌ బాస్ 2 ఫైనల్‌కు చేరిన ఐదుగురిలో ఒకరు సామ్రాట్. 15 ఏళ్లుగా సినిమాల్లో నటిస్తున్న సామ్రాట్‌ రెడ్డి… బిగ్‌ బాస్‌ షోతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. బిగ్‌ బాస్ షోలోకి ప్రవేశించడానికి ముందు భార్యతో విబేధాలు వచ్చాయి. భర్త నుంచి విడాకులు కోరుతూ సామ్రాట్ భార్య కోర్టులో కేసు వేసింది. ఇక బిగ్‌ బాస్ షోలో సామ్రాట్ ప్రవర్తనపై భిన్నాభిప్రాయలు ఉన్నాయి.

చిన్నపిల్లల మనస్తత్వం అనే ముద్ర పడింది. ఒకపట్టాన ఎవరికీ అర్థం కాడనే విమర్శ ఉంది. కానీ షోలో ఇతర సభ్యులకు బాగా నచ్చాడు. ఒకసారి ఎలిమినేషన్‌కు నామినేట్ కూడా అయ్యాడు.

సామ్రాట్‌నూ ప్లస్‌లు, మైనస్‌లు ఉన్నాయి. బిగ్‌ బాస్‌ షోలో సామ్రాట్ ఇతరులకు నచ్చాడు. దీనికి కారణం చిన్నపిల్లల్లాంటి ప్రవర్తనే అనే అభిప్రాయాలున్నాయి.

సామ్రాట్‌ మైనస్‌లలో ముఖ్యమైంది అతడి ప్రవర్తనే. అందరూ గెలుపుకోసం ప్రయత్నిస్తే… సామ్రాట్ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. ఇక ఇదే షోలో తేజస్వితో ప్రవర్తించిన తీరు ప్రేక్షకులకు నచ్చలేదు.