SBI వినియోగదారులకు భారీ షాక్.. వారి పరిస్థితి ఏంటో..

sbi-cuts-atm-cash-withdrawal-limit-to-rs-20000-per-day

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) తన వినియోగదారులకు భారీ షాక్ ఇచ్చింది. ATMs నుంచి నగదు విత్ డ్రా పరిమితి రోజుకు రూ.40,000 నుంచి రూ .20,000 కు తగ్గించిందని ది ఎకనామిక్ టైమ్స్ కధనంలో పేర్కొంది. ఇది ఇప్పటికే ఇష్యూ చేసిన ‘క్లాసిక్’ మరియు ‘మాస్ట్రో’ డెబిట్ కార్డులకు వర్తించనుంది. కొత్త పరిమితి అక్టోబర్ 31 నుండి అమలులోకి వస్తుందని సమాచారం. ATMల వద్ద మోసపూరిత లావాదేవీల గురించి బ్యాంకులు అందుకున్న ఫిర్యాదుల సంఖ్య పెరిగిపోవడం, నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడం వంటి కారణాలతో ఈ చర్యను చేపట్టింది. ATMs మోసపూరిత లావాదేవీలతో ఇబ్బందులు ఎదుర్కుంటున్న వారు సంబంధిత బ్రాంచ్ లను ఆశ్రయిస్తున్నారు. దాంతో బ్యాంకులు ఈతరహా ఫిర్యాదులతో ఇబ్బందులో ఎదుర్కొంటున్నాయి. డిజిటల్ నగదు లావాదేవీలను ప్రోత్సహించే దిశగా వివిధ బ్యాంకులు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఎస్బిఐ కూడా ఈ నిర్ణయం తీసుకుంది. కాగా ఈ విషయాన్నీ ఎస్బిఐ కస్టమర్లకు తెలియజేయాలని అన్ని ఎస్బిఐ శాఖలకు సూచించింది. ఇదిలావుంటే ఎస్బిఐ తాజా నిర్ణయంతో వినియోగదారులు షాక్ లో మునిగిపోయారు. డిజిటల్ నగదు లావాదేవీలపై అవగాహన లేని వాళ్ళ పరిస్థితి ఏంటన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.