శివబాలాజీ, కౌశల్ గెలుపుకి కారణం ఆమెకు బావ అవ్వటమే!

2017 జులై 16న బిగ్ బాస్ -1 స్టార్ట్ అయింది. మహరాష్ట్రలోని పూణెకి 64 కిలోమీటర్ల దూరంలో లోనావాలా అనే పట్టణంలోని ఓ అధునాతనమైన ఇంటిలో బిగ్ బాస్ సిరీస్ వన్ జరిగింది. మొత్తం 16 మంది సెలబ్రెటీలతో షో స్టార్ట్ చేశారు. దీనికి జూ. ఎన్టీయార్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఆయన చేసిన సందడి అంతా ఇంతా కాదు.. వేదికపై నుంచే హౌస్ లోని సభ్యులను ఉత్సాహపరిచారు. 2017 జులై 16న ప్రారంభమైన మొదటి సీరిస్ మొత్తం 71 రోజుల పాటు జరిగింది.

ఇక 2018 జూన్ 10 నుంచి బిగ్ బాస్ -2 స్టార్ట్ అయింది. ఈ సారి సెట్ హైదరాబాద్ కే వచ్చింది. మహారాష్ట్ర నుంచి తెలంగాణలోని అన్నపూర్ణ స్టూడియోకు మారింది. అన్నపూర్ణ ఏడెకరాల్లో ప్రత్యేకంగా బిగ్ బాస్ ఇంటి సెట్ వేశారు. మొత్తం 18 మంది కంటెస్టెంట్లు షోలో పాల్గొన్నారు. ఏదైనా జరగొచ్చు అన్న ట్యాగ్ లైన్ తో యంగ్ నాచురల్ స్టార్ నాని ఈ షోను హోస్ట్ చేశారు.

సీజన్‌ వన్‌లో శివబాలాజీ విజేతగా నిలిచి 50 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకున్నారు. ఇప్పుడు ఆ అదృష్టం కౌశల్ మండాని వరించింది. బిగ్ బాస్ సీజన్ 2 విజేతగా నిలిచి ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.

అయితే వీళ్ల ఇద్దరి గెలుపుకి కారణం ఓ అమ్మడు. అవును ఈ అమ్మడుకి బావ అవ్వటం వల్లే.. వీళ్లద్దరూ బిగ్ బాస్ హౌస్‌లో లెట్స్ డూ కుమ్ముడు అంటూ దూసుకుపోయారనే వార్త హాల్‌చల్ చేస్తోంది. ఇంతకీ ఆ అమ్మడు మరేవరో కాదు.. అందాల తార కాజల్.

అందేంటీ..? కాజల్‌కి శివబాలాజీ, కౌశల్ ఎలా బావలు అవుతారని ఆలోచిస్తున్నారా.. ‘చందమామ’ మూవీలో శివబాలజీ కాజల్‌కి బావగా నటించాడు. బిగ్‌బాస్ సీజన్‌ 1 విజేతగా నిలిచాడు.

‘మిస్టర్ ఫరపెక్ట్’ సినిమాలో ఆమెకి బావగా కౌశల్ యాక్ట్ చేశాడు. అంతే.. దెబ్బకు బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ అయ్యాడు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి కాజల్‌కి బావగా నటించే యాక్టర్ పై పడింది.

వరుస విజయాలు వరిస్తే అదృష్టం బావుందంటూ అందలం ఎక్కిస్తారు. లేదంటే ఐరన్ లెగ్ అంటూ అస్సలు పట్టించుకోరు. ఇప్పుడు చూడబోతే అలానే ఉంది. కాజల్‌కి బావైతే బిగ్ బాస్ విన్నర్ అవ్వటం ఏంటీ..? మరీ విచిత్రం కాకపోతే .. ఇప్పుడు ఈ వార్తే సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఒకవేళ బిగ్‌బాస్ సీజన్ 3 ని 2018లో స్టార్ట్ అయితే ఇందులో ఎంట్రీ ఇవ్వాలనుకునే స్టార్‌లు కాజల్ కి బావగా యాక్ట్ చేస్తామంటూ క్యూ కడతారేమో.