మను భాకర్‌‌కు అరుదైన అవకాశం

అర్జెంటీనాలోని బ్యూనస్‌ ఎయిర్స్‌లో జరిగే యూత్‌ ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవ వేడుకకు అంత సిద్ధమవుతోంది. ప్రారంభోత్సవ వేడుకల్లో 16 ఏళ్ల మను భాకర్‌ త్రివర్ణ పతాకంతో భారత బృందాన్ని ముందుండి నడిపించనుంది. టీనేజ్‌ షూటింగ్‌ స్టార్‌గా ఎదిగిన మను భాకర్‌ గత కొంత కాలంగా షూటింగ్‌లో మంచి ప్రతిభ కనబరుస్తోంది. 68 మంది క్రీడాకారులతో కూడిన భారత జట్టు ఇందులో పాల్గొంటుంది. యూత్‌ ఒలింపిక్స్‌లో పాల్గోనే భారత జట్టుకు కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్‌ రాథోడ్‌ శుభాకాంక్షలు తెలిపారు. భారత జట్టు మంగళవారం అర్జెంటీనా బయల్దేరనుంది.