ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడకపోవడానికి కారణం ఏంటంటే..

-kumar

మాటల మాంత్రికుడు అంటారు.. కానీ నావి మామూలు మాటలే అంటాడు…
హీరోలను మాయ చేస్తాడు అంటారు.. నేను నిజాయితీగా ఉంటానంటాడు..
పరజయాలు గురించి అడిగితే నేను అక్కడే ఆగను అంటాడు. .

కానీ ఆయన మాటలు తేలికగా అర్ధాలు బరువుగా ఉంటాయి. ఆయన మాటలలో తెలుగుదనం నిండుగా కనపడుతుంది. అరవింత సమేత వీరరాఘవ తో ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా త్రివిక్రమ్ కాసేపు మీడియాతో మాటలు కలిపారు..

అందుకే మాట్లాడలేదు..
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడకపోవడానికి కారణం…
ఆ సందర్భంలో వాళ్ళు చాలా భాదల్లో ఉన్నారు. ఆ గాయం ఇంకా పచ్చిగానే ఉంది. ఏం మాట్లాడినా అక్కడికే వెళ్ళతాం అందుకే అక్కడ ఎక్కువ మాట్లాడలేదు

రిలీజ్ సమ్మర్ అనుకున్నాం…
ఆ సంఘటన జరిగిన తర్వాత సినిమా రిలీజ్ ఫిక్స్ అవలేదు. జనవరిలో సినిమాలు చాలా ఉన్నాయి అందుకే సమ్మర్ కి వెళదాం అనుకున్నాం. రెండో రోజు తారక్ ఫోన్ చేసి మూడు రోజులు బయటికి రాకూడదు చినబాబు(నిర్మాత) గారికి చెప్పండి నాలుగో రోజున పని మొదలు పెడదాం. అక్టోబర్ 11కి వచ్చేస్తున్నాం అన్నారు.

ప్యాక్షన్ బ్యాక్ డ్రాప్ అనుకోలేదు..?
కథ రాస్తున్నప్పుడు గొడవ అయిపోయిన తర్వాత మాట్లాడుకోవడానికి ఏం ఉండదు.. గొడవ ముందు , గొడవ జరుగుతున్న సందర్భం మాత్రమే హైలెట్ చేస్తాం. గొడవ తర్వాత చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. మహాభారతం లో కూడా యుద్దం అనంతరం ఉండే పర్వాల గురించి పెద్దగా చెప్పరు. కానీ యుద్దం తర్వాత కూడా వదిలేయకూడని అంశం అనిపించింది. గొడవ తర్వాత ఏం జరుగుతుంది. పోయిన వారి ఫ్యామిలీలు, గెలిచిన వారి ఫ్యామిలీలు హ్యాపీగా ఉంటాయా..? బేసిక్ గా ఎవరూ ఆడవాళ్ళను ముందు పెడితే ఏలా ఉంటుంది. వాళ్లు లీడ్ చేస్తే యుద్దం మే జరగకుండా ఉండేదా..? ఈ ఐడియా ఎన్టీఆర్ కి బాగా నచ్చింది. అందుకని ఆ బ్యాక్ డ్రాప్ తీసుకున్నాం..

సమాజం లో మంగళం ఎక్కడుంది..
ఆడియన్స్ కూడా రాటు తేలారు. పొద్దన లేచిన దగ్గరనుండి అన్నీ అమంగళాలే చూస్తునాం. రోడ్ యాక్సిడెంట్ లు, చిన్నపిల్లలపై అత్యాచారాలు చూస్తున్నాం. సమాయాన్ని బట్టి ప్రేక్షకుల ఎమోషన్స్ మారుతుంటాయి. అందుకే ఈ కథ ఇప్పడు చెప్పడం అప్రస్తుతం, అసందర్భం కాదు అనుకున్నా.

ముందు హీరోయిజం తోనే మొదలవుతుంది..
స్టార్ హీరో తో కథ చెస్తున్నప్పుడు తప్పుండా హీరోయిజం ఎలిమెంట్స్ తోనే మొదలు పెడతాం. కానీ ఇందులో ఇందులో ఈ యాంగిల్ కుదరింది. కథను డవలెప్ చేసే టప్పుడు యద్దం తర్వాత కథ ఉంది కదా అనిపించింది. అటువైపు ఎవరూ లైట్ వేయలేదు. మేము ముందుు తెచ్చే ప్రయత్నం చేసాం.

మదర్ సెంటిమెంట్ కథ కు అవసరం అనైంత వరకే ఉంటుంది..
కథకు ఎంత వరకూ అవసరమో అంత వరకూ ఉంటుంది. ఏదీ బలవంతంగా రుద్ద లేదు. పెనిమిటి సాంగ్ కూడా కథలో బాగం గానే ఉంది. అందరి ఆడవాళ్లకు ఆ మదర్ ని సింబలైజ్ చేసాం. తల్లి బాధను కొడుకు పాడితే ఎలా ఉంటుందో ట్రై చేసాం అందులో 60 పర్సెంట్ మాంటేజ్ లోనే ఉంటుంది. మీరు టీజర్ లో చూసింది 40 పర్సెంట్ లోనిది .

ఫస్టా హాఫ్ లో హీరో తక్కువ మాట్లాడతాడు..
ఏదైనా సంఘటన అంటే మాటల వల్లే జరుగుతుంది. అది ప్రేమించుకున్నా, కొట్టుకున్నా, విడిపోయినా, తిరిగి కలుసుకున్నా. అందుకే ఈ జనరేషన్ వాళ్ళు ఇద్దరూ మాట్లాడుకుంటారు. అదే చూపించాం. హీరో తక్కువ మాట్లాడతాడు.

ntr

ఐటం కామెడీ లేదు..
కామెడీ ని కథలోకి తీసుకురాలేదు. ఆ భయాలను వదిలేశాం. బ్రహ్మానందం గారి లాంటి వారిని తీసుకు వచ్చి నవ్వించే ప్రయత్నం చేయలేదు. సినిమాకి ఫ్యాన్స్ ఉంటారు కానీ మనుషులకు ఉంటారంటే నేను నమ్మను.

జగపతి క్యారెక్టర్ క్రూయల్ కాదు అది ఆ పాత్ర స్వభావం..
కొంతమంది మనుషులు ఏం చెప్పినా వింటానికి సిద్దం గా ఉండరు. అది ఖచ్ఛితంగా ఇరిటేట్ చేస్తుంది.
ఏం చెప్పినా వినని వారిని చూస్తే కోపం వస్తుంది.

మా కాంబినేషన్ కి ఇంతకాలం పట్టడానికి కారణం..
నాన్నకు ప్రేమతో టైం లో ఖచ్చితంగా సినిమా చేద్దాం అనుకున్నాం అప్పడు నేను అ ఆ చేస్తున్నా. ఊరికే అనుకోవడం కాదు సినిమా చేయాలని డిసైడ్ అయ్యాం. రెండు మూడు కథలు చెప్పాను. అందులో ఈ కథకు బాగా ఎగ్జైట్ అయ్యాం.

ఫెయిల్యూర్స్ ని ఎనలైజ్ చేయను..
అలా అని పట్టించుకోనంటే అబద్దమే . అది ఒక మొమెంటరీ గా ఉంటుంది. అదే పట్టుకోని ఓ పిసికేసుకోను. అది అద్భుతమైనా కనిపించిన వారందనీ చూసావా.. మనం కొట్టేసాం అని చెప్పను. అత్తారింటికి దారేది అప్పుడు అలాగే ఉన్నా. అజ్ఞాతవాసి అప్పుడు అలాగే ఉన్నా. తప్పు జరగగానే తెలిసిపోతుంది. తెలియదు అనుకుంటే అబద్దం అవుతుంది. తెలుసుకోవాలంటే వెంటనే తెలసిపోతుంది. నచ్చడానికి లక్షకారణాలుంటాయి. నచ్చకపోవడానికి కూడా లక్ష కారణాలుంటాయి. మనం చేయాల్సింది వాటికి సరెండర్ అవ్వడమే . గౌరవించడమే..

నిజాయితీగా ఉండటమే నాకు తెలిసింది..
అందరూ నాతో స్నేహంగా ఉండటానికి కారణం వారితో నిజాయితీ గా ఉండటమే. మనం తెలివితేటలు చూపిస్తే వారెంత తెలివిగా ఉంటారో ఆలోచించండి. నేను ఇప్పటి వరకూ పనిచేసిన వారందరూ సామాన్యులు కాదు. మాట్లాడటం మొదలు పెట్టగానే ఆలోచనలు పసిగట్టగలరు. అందుకే వాళ్ళతో నిజాయితిగా ఉండటమే నాకు తెలుసు.

డబ్బింగ్ క్రెడిట్ హీరోయిన్స్ దే..
నేను చెప్పించలేదు. వాళ్లు చెబుతా అంటే కాదనలేదు . ఏదైనా సీన్ చెసినప్పుడు హీరోయిన్ డబ్బింగ్ చెబుతానంటే నేను ఎగ్జైట్ మెంట్ అనుకునే వాడిని. కానీ తను చాలా సీరియస్ గా తన డబ్బింగ్ తనే చెబుతానంటే ఓకే అన్నాను.

సునీల్ తీసుకుందాంఅని రెండు సంవత్సాల నుండీ అనుకుంటున్నాం..
కానీ బలవంతగా తీసుకురాలేదు. అతను ఉన్న బౌండరీస్ బద్దలు కోట్టాలంటే అది నాచురల్ గా జరగాలి. ముందు ఉన్న కమిట్ మెంట్స్ మొత్తం కంప్లీట్ చేయమన్నా. కొత్తవి హీరోగా ఒప్పుకోవద్దు.. అన్నాను.

ఏం చేసినా డైలాగ్ లు బాగా రాస్తానంటారు..
అతడు దగ్గర నుండి నేను ఎంచేసినా డైలాగ్స్ బాగా రాస్తావంటారు. అది నేను కిరీటంగా భావించను.
మాటల మాంత్రికుడు అంటే నేను నన్ను కాదు అనుకుంటా.

కొన్ని సినిమాలు నన్ను అసూయపడేలా చేసాయి..
నేను సినిమాలు అన్నీ చూస్తాను. అది కూడా థియేటర్ కి వెళ్లి చూస్తాను. గొప్ప సినిమా చూసినప్పుడల్లా జలసీ వస్తుంది. మనమీద మనకు కోపం వస్తుంది. ఇంకా బాగా తీయాలనిపిస్తుంది. ఈ మద్య కాలంలో అర్జున్ రెడ్డి,రంగస్థలం, ఆర్ ఎక్స్ హండ్రెడ్, కెరాఫ్ కంచరపాలెం, పెళ్ళి చూపులు, గూడాఛారి సినిమాలు నన్ను అసూయ పడేలా చేసాయి. గూఢాచారి బాగా అభినందిచాల్సిన సినిమా . తక్కువ బడ్జెట్ లో గూడాఛారి వంటి సినిమా చేయడం చాలా కష్టం .

ఇప్పుడు ఎంటర్ టైన్మెంట్ కోసం సినిమా కాదు..
ఒకప్పుడు ఎంటర్ టైన్మెంట్ కోసం సినిమా తప్ప మరో వ్యాపకం లేదు. కానీ ఇప్పడు జబర్ధస్త్ ఉంది ఎక్స్ ట్రా జబర్దస్త్ ఉంది. బ్రహ్మానందంగారు హోస్ట్ గా ఒక స్టాండప్ కామెడీ ప్రొగ్రాం ను మొదలు పెట్టారు. కామెడీ కోసం అయితే ఇంట్లోనే చూడొచ్చు. అలాంటప్పుడు కామెడీ కోసం ఏదైనా ఐటం పెడితే జనాలు తిడతారు. ఎందుకంటే కావాలసినంత కామెడీ ఇంట్లోనే ఉంది.

బడ్జెట్ నాకు తెలియదు..
దాని గురించి ఆలోచించను. బడ్జెట్ గురించి కొంచెం అవగాహాన ఉంటే చాలు ఎక్కువ ఉండకూడదు. కథ రాసుకునే టప్పుడే బడ్జెట్ మనసులోకి వస్తే కంట్రోల్ అయిపోతాం. బాహుబలి ని పేపర్ మీద పెడితే ఎవరూ చేయరు. అదే నా ఆన్సర్ .

రిజల్ట్ కూడా ముఖ్యమే..
రిజల్ట్ అవసరం జర్నీ కూడా ఇంపార్టెంట్ లేదంటే మనుషులు చచ్చిపోతారు. 90 పర్సెంట్ జర్నీ ముఖ్యం 10 పర్సెంట్ రిజల్ట్.

హిట్ కోట్టడం మనచేతుల్లో లేదు..
ముందు హిట్ కొట్టాలనే మొదలు పెడతాం తర్వాత పనిలో పడ్డాక అవేమీ గుర్తుుండవు. పనితాలూకు ఎగ్జైట్ మెంట్ ఎంజాయ్ మెంట్ లో వెళిపోయాను.

సన్నివేశాలను ఎక్కువ గ్లామరైజ్ చేయలేదు..
కథలోని సన్నివేశాలకుమరీ ఎక్కువ గ్లామరైజ్ చేయలేదు వీలున్నంత వరకూ. అలా అని రా గా కూడా ఉండకుండా బాలెన్స్ చేసాను.

ఎన్టీఆర్ చేసిన సీన్స్ రిపీట్ కాకుండా జాగ్రర్త పడ్డాను..
ఎన్టీఆర్ ఇంతకు ముందు చేసిన వాటిని రిపీట్ కాకుండా జాగ్రర్త పడ్డాను. వారి బలాన్ని వాడుకుంటూనే చిన్న చిన్న మార్పులు చేసాను.

ntr-jr-returns-aravinda-sametha-sets

అనిరుధ్ నుండి నేనే గ్యాప్ తీసుకున్నా..
ముందు అతనే మ్యూజిక్ డైరెక్టర్ మీకు సినిమా ఓపెనింగ్ లో కూడా కనపడతాడు. కానీ నీకు తెలుగు సినిమా అర్దం కావడానికి నీ మ్యూజిక్ నాకు అర్దం కావాడానికి కొంత గ్యాప్ గ్యాప్ తీసుకోవడం బెటర్ అని నేనే చెప్పాను.

థమన్ లో లోతు చూసాను..
మాటల్లో ఒకసారి ‘ ఆ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అడగటం లేదు’ అన్నాడు. నేను షాక్ అయ్యాను. అతను వయస్సుకు మించి లోతైన వాడు. సినిమా అతనికి సెకండ్ నేచర్. అతనికి ఎక్కువ చెప్పాల్సిన అవరసం లేకుండా పోయింది. నేను పాటల్లో హిందీ వద్దని చెప్పాను. డాన్స్ నెంబర్స్ జోలికి వెళ్లోద్దని చెప్పాను. నన్ను వెనక్కు లేదు. అతను బయటకు కనపించి నంత తేలికగా కనిపించే మనిషి కాదు. అతనితో మాట్లాడితే కొన్ని సార్లు ఆశ్చర్యం కలిగింది. అతను సినిమాకి కావాల్సిన మ్యూజిక్ అందించాడు.

దేవిశ్రీ అంటే నాకు ఇష్టం..
ఇది నన్ను నేను వెతుక్కునే ప్రయత్నం. ఇద్దరి మద్య గ్యాప్ వచ్చిందంటే దానికి కారణం గోడవే అయ్యిండాల్సిన అవసరం లేదు. నాలో మార్పుకోసం నేను చేసిన ప్రయత్నం ఇది. అ ఆ చేయకపోడాకి కారణం దేవిశ్రీ ఆ బడ్జెట్ లో ఇమడడు. అందుకే చేయలేదు.

కథ ఎక్కవ సార్లు వినడం ఎన్టీఆర్ టెక్నిక్..
కథను ఎక్కువ సార్లు వింటాడు. ఎక్కవు సార్లు కథగురించి మాట్లాడతాడు. అందుకే అది తనకు నాచురల్ గా చేసే విషయం అయిపోతుంది. అందుకే సీన్ చెప్పగానే వెంటనే డెలివరీ చేస్తాడు. అందుకే ఎన్టీఆర్ తో పని సులువు గా అవుతుంది.

యుద్దం తర్వాత కథ..
యుద్దం ముందు యుద్దం జరిగే టప్పుడు జరిగే సంఘటనలు ఆసక్తి గా ఉంటాయి. వాటతో పాటు యుద్దం తర్వాత ఏం జరిగింది అనేది ఈ కథ. తప్పకుండా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. అని ముగించారు త్రివిక్రమ్.