కర్ణాటక రాజకీయాల్లో మరో కుదుపు..

bsp-minister-n-mahesh-quits-kumaraswamy-cabinet

కర్ణాటక రాజకీయాల్లో మరో కుదుపు ఏర్పడింది. ప్రస్తుతం విద్యా శాఖ మంత్రిగా కొనసాగుతున్న ఎన్ మహేశ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కుమారస్వామి మంత్రివర్గంలో బీఎస్‌పీ నుంచి కొనసాగుతున్న ఏకైక కేబినెట్ మంత్రి మహేశ్.. మంత్రి పదవికి రాజీనామా చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి గురువారం తన రాజీనామా లేఖను సమర్పించారు. అనంతరం మాట్లాడిన మహేశ్.. వ్యక్తిగత కారణాలరీత్యా మంత్రి పదవికి రాజీనామా చేసినట్టు చెప్పారు. అలాగే తాను కేవలం బెంగుళూరుకు పరిమితమయ్యానని తన నియోజకవర్గం కొల్లెగల్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నానని ప్రతిపక్షాలు ఆరోపించడం వంటి కారణాలు కూడా రాజీనామాకు దారి తీశాయని.. మంత్రి పదవికి రాజీనామా చేసినా కుమారస్వామి ప్రభుత్వానికి తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. అంతేకాకుండా 2 అసెంబ్లీ స్థానాలు, 3 లోక్‌సభ స్థానాలకు జరిగే ఉపఎన్నికల్లో జేడీఎస్ తరఫున ప్రచారం చేస్తానని అయన తెలిపారు.