ఆ రెండు జిల్లాల్లో తిత్లీ బీభత్సం.. దొరకని బోట్ల ఆచూకీ..

cyclone-gaja-pounds-tamil-nadu-strong-wind-heavy-rain

శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తిత్లీ బీభత్సం కొనసాగుతోంది.. ఈ తుఫాను బీభత్సానికి ఇప్పటి వరకు 8 మంది మృతి చెందినట్టు అధికారులు దృవీకరించారు. మృతుల్లో ఐదుగురు శ్రీకాకుళం, ముగ్గురు విజయనగరం జిల్లా వాళ్లు ఉన్నట్టు గుర్తించారు..

సముద్రంలో వేటకు వెళ్లడంతో ఆరుగురు మృతి చెందారు.. ఒకరు ఇళ్లు కూలి.. మరొకరు చెట్టు కూలి మృతి చెందారు. కాకినాడలో 67 బోట్లలో మత్స్యకారులు వేటకు వెళ్లారు.. అయితే వాతావరణం భయపెట్టడంతో 65 బోట్లు వెనక్కు వచ్చేసాయి.. రెండు బోట్లను సురక్షితంగా బయటకు చేర్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు..

మరోవైపు ఒడిస్సాలోని గంజాం పోర్టు సమీపంలో 7 బోట్లు గల్లంతయ్యాయి… పది రోజుల కిందటే విశాఖ నుంచి 150 బోట్లు వేటకు వెళ్లాయి… ఏడు బోట్లలో ఒక బోటులోని ముగ్గురు మత్స్యకారులు గల్లంతయ్యారు. ఇంకా ఏడు బోట్లు ఆచూకీ దొరకకపోవడంతో.. అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు..

తిత్లీ తుపాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో బలమైన గాలులు వీస్తున్నాయి. దీంతో విద్యుత్‌ వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జిల్లాలో విద్యుత్‌ శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మంత్రి కళా వెకంట్రావు ఆదేశించారు.. క్షేత్రస్థాయిలో సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు..

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ‌ స్తంబాలు, చెట్లు విరిగి పడడంతో విద్యుత్‌ సరఫరా ఎక్కడికక్కడ నిలిచిపోయింది. గాలుల తీవ్రత ఆగడం లేదు, దీనికి తోడు భారీ వర్షం కురుస్తుండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది.