ఒకే పాటకు తండ్రీకూతుళ్ళ హమ్మింగ్ .. వీడియో వైరల్..

Father and Daughter Sing Girls like you by Maroon

సాధారణంగా చంటిపిల్లలు తల్లిదండ్రులను అనుకరిస్తారనడంలో ఏమాత్రం సందేహం లేదు.తల్లిదండ్రులు వారు ఏదైతే మాట్లాడతారో వారి చంటిపిల్లలు సైతం ఆ మాటలను ఆలకిస్తారని.. అంతేకాకుండా మాటకూడా కలుపుతారని శాస్త్రవేత్తలు చెబుతున్న సంగతి తెలిసిందే. అందుకు ఉదాహరణ ఈ వీడియోనే.. ఇటీవల సోషల్ మీడియాలో షేర్ అయినా ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ‘Girls Like You’ అనే పాటకు ఈ తండ్రీకూతుళ్లు ఒకేసారి లిప్ సింక్ చేస్తూ అద్భుతంగా పాడారు. అచ్చంగా తండ్రి పాడుతుంటే ఆ చంటి పాప కూడా తండ్రిని అనుకరిస్తుంది. ఇందుకు కారణం ఆ బిడ్డకు అలా అలవాటు చేయడం.. పదే పదే వారికీ ఇష్టమైన విధంగా మాట్లాడటం వలన తల్లిదండ్రుల మాటలు, లిప్ మూమెంట్ ను అనుకరిస్తారని నిపుణులు అంటున్నారు. కాగా వీడియోలో వీళ్లిద్దరూ పాడుతుండడం చూసినవాళ్లంతా సంతోషంవ్యక్తం చేస్తున్నారు. తండ్రికూతుర్ల అనుబంధం ఇలాగె ఉంటుంది అంటూ జనాలు కామెంట్లు పెడుతుండటం విశేషం.